పాలనలో తప్పుడు నిర్ణయం వల్లే ట్రూ అప్ చార్జీలు: లంకా దినకర్

ABN , First Publish Date - 2021-09-14T16:44:27+05:30 IST

పాలనలో తప్పుడు నిర్ణయం వల్లనే ట్రూ అప్ చార్జీల బాదుడుకి కారణమని బీజేపీ నేత లంకా దినకర్ విమర్శించారు.

పాలనలో తప్పుడు నిర్ణయం వల్లే ట్రూ అప్ చార్జీలు: లంకా దినకర్

అమరావతి: పాలనలో తప్పుడు నిర్ణయం వల్లనే ట్రూ అప్ చార్జీల బాదుడుకి కారణమని బీజేపీ నేత లంకా దినకర్ విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ యూనిట్‌కు రూ.1.23ల చొప్పున ట్రూ అప్‌ చార్జీలను కూడా కలిపి వినియోగదారులకు బిల్లులు వస్తున్నాయన్నారు. వైసీపీ అధికారంలోకి రాగానే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు రద్దు చేసిందని, తర్వాత ఏక్కువ రేట్లతో పవర్ కొనుగోలుకి అగ్రిమెంట్లు చేసుకుందని ఆరోపించారు. పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ల రద్దుతో వ్యయం తగ్గించి సేవ్ చేశామని చెప్పిన ప్రభుత్వం.. ట్రూ అప్ చార్జీలు ఏలా వచ్చి.. విద్యుత్ చార్జీలు పెరిగాయో తెలపాలని డిమాండ్ చేశారు. నాటి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ల రద్దుతో రాష్ట్రం పరువు పోయిందని.. ఇప్పుడు ప్రజల జేబుకు చిల్లుపడుతుందన్నారు. టీ కొట్టుకి, బడ్డి కొట్టుకి, లాండ్రీ షాప్‌లకు వచ్చే కరెంట్ బిల్లుల షాక్‌కు సామాన్యులు విల విలలాడుతున్నారని లంకా దినకర్ అన్నారు.

Updated Date - 2021-09-14T16:44:27+05:30 IST