లాప్‌టాప్‌ కీబోర్డ్‌ పనిచేయడం లేదా! ఇలా ట్రై చేయండి

ABN , First Publish Date - 2021-11-27T05:33:22+05:30 IST

లాప్‌టాప్‌ కీబోర్డ్‌ సతాయిస్తోందా? ‘కీ’లు ప్రెస్‌ కావటం లేదా? ర్యాండమ్‌ టెక్స్ట్‌ స్ర్కీన్‌పై కనిపిస్తోందా? అయినప్పటికీ హైరానా చెందాల్సిన పని లేదు. కింది ఈ ట్రిక్కులూ అప్లయ్‌ చేసి చూడండి...

లాప్‌టాప్‌ కీబోర్డ్‌ పనిచేయడం లేదా! ఇలా ట్రై చేయండి

లాప్‌టాప్‌ కీబోర్డ్‌ సతాయిస్తోందా? ‘కీ’లు ప్రెస్‌ కావటం లేదా? ర్యాండమ్‌ టెక్స్ట్‌ స్ర్కీన్‌పై కనిపిస్తోందా? అయినప్పటికీ హైరానా చెందాల్సిన పని లేదు. కింది ఈ ట్రిక్కులూ అప్లయ్‌ చేసి చూడండి. మీ లాప్‌ట్యాప్‌ కీబోర్డు పనిచేయవచ్చు!


రీబూట్‌: మొదట పీసీని రీబూట్‌ చేయండి. ఇదొక్కటే తరుణోపాయం కానప్పటికీ, ఒకసారి ప్రయత్నించవచ్చు. హార్డ్‌వేర్‌ సమస్యనా, సాఫ్ట్‌వేర్‌ సమస్యనా అనేది తేల్చుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. అయితే రీబూట్‌ అన్నది త్వరితగతిన చేస్తే సమస్యను నివారించి, యథాతథంగా కీబోర్డ్‌ పనిచేయవచ్చు. 


క్లీనింగ్‌: ఎక్కువసార్లు ఏదో తింటూ పని చేసుకుంటూ ఉంటారు. ఆ సమయంలో కొద్దిపాటి పదార్థం ముక్కలు ఆ మధ్య ఇరుక్కుపోవచ్చు. అసలు అలాంటివి పడినట్టు గమనిస్తే, వెంటనే క్లాత్‌ తీసుకుని శుభ్రం చేసేయాలి. టూత్‌పిక్‌తో కీ అడుగున, పక్కవైపులా క్లీన్‌ చేయాలి. కంప్రెస్డ్‌ ఎయిర్‌ పంపి శుభ్రం చేసుకోవడం మరో పద్ధతి. ఆన్‌లైన్‌లో ఈ సదుపాయం లభిస్తుంది. రూ.200కి తక్కువ కాకుండా వసూలు చేస్తారు. 


కీబోర్డ్‌ సెట్టింగ్స్‌: కొన్ని సాఫ్ట్‌వేర్‌ సెట్టింగ్స్‌ కారణంగా కూడా కొన్ని సందర్భాల్లో కీబోర్డ్‌ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.  ఇందుకోసం స్టార్ట్‌ మెనూ ఓపెన్‌ చేసి  కీబోర్డ్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్ళాలి. ‘కంట్రోల్‌ ప్యానల్‌’ అని టైప్‌ చేయాలి. కంట్రోల్‌ ప్యానల్‌ విండోలో కీబోర్డ్‌ కోసం సెర్చ్‌ చేయాలి. అలా సెట్‌ చేసుకోవాలి.


కీబోర్డ్‌ డ్రైవర్‌ అప్డేట్‌: ల్యాప్‌టాప్‌ కీబోర్డుని అప్డేట్‌ చేయడం మరొకపని. దీనికోసం స్టార్‌మెనూ సెర్చ్‌బార్‌లో డివైస్‌ మేనేజర్‌ అని టైప్‌ చేయాలి. కీబోర్డ్స్‌ చూసేవరకు బ్రౌజ్‌ చేయాలి. దానిపై రైట్‌ క్లిక్‌ చేసి ప్రాపర్టీస్‌ - డ్రైవర్‌లోకి వెళ్ళాలి. అప్డేట్‌ డ్రైవర్‌ను క్లిక్‌ చేసి, విండోస్‌ కోసం వెయిట్‌ చేయాలి. అందులో న్యూడ్రైవర్‌ కనిపిస్తుంది. దాన్ని ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి.


కీబోర్డ్‌ డ్రైవర్‌ తొలగింపు: కీబోర్డు డ్రైవర్‌ను అన్‌ఇస్టాల్‌ చేయడం మరో విధానం. దీనిని కూడా కీబోర్డ్‌ అప్డేట్‌ మాదిరిగానే అన్‌ ఇన్‌స్టాల్‌ కోసం స్టెప్స్‌ ఫాలో కావాలి. డివైస్‌ మేనేజర్‌లో ఉన్నప్పుడు కీబోర్డ్‌ డ్రైవర్‌ను కనుగొనాలి. పసుపురంగులో ఎక్స్‌క్లమేషన్‌ వార్నింగ్‌ కనిపిస్తే, అది తప్పకుండా డ్రైవర్‌ ప్రాబ్లమే. 


రీప్లేస్‌మెంట్‌: ఫిజికల్‌గా దెబ్బతింటే రీప్లేస్‌ చేసుకోవాల్సిందే. అటాచ్డ్‌ కాంపోనెంట్స్‌ అన్నింటినీ తొలగించాల్సి ఉంటుంది.

Updated Date - 2021-11-27T05:33:22+05:30 IST