Advertisement

‘బ్రోతల్’ అంటే ఏంటి?... 9 ఏళ్ల కూతురి ప్రశ్నకు షాకైన బాలీవుడ్ హీరోయిన్!

టెన్నిస్ ఛాంపియన్ మహేశ్ భూపతిని పెళ్లాడింది లారా దత్తా. వారికి ఓ కూతురు. ఇప్పుడు లారా దత్తా గారాల వారసురాలి వయస్సు 9 ఏళ్లు. కానీ, ఆ అమ్మాయి వేసే ప్రశ్నలు అప్పుడప్పుడూ సీనియర్ బాలీవుడ్ హీరోయిన్ని ఆశ్చర్యపరుస్తుంటాయట. లారా కూతురు 4 ఏళ్లున్నప్పుడు ‘డైవోర్స్’ అంటే ఏంటని అడిగిందట! ఇక ఇప్పుడు 9 ఏళ్ల వయస్సులో తను అడిగిన మరో షాకింగ్ కొశన్‌కి యాన్సర్ ఎలా చెప్పాలో తెలియక లారా ఇబ్బంది పడిందట!


లారా దత్తా రీసెంట్‌గా ‘హికప్స్ అండ్ హుకప్స్’ అనే వెబ్ సిరీస్ చేసింది. డిజిటల్‌గా స్ట్రీమింగ్ అవుతోన్న బోల్డ్ షోలో ఆమె ఓ టీనేజ్ అమ్మాయికి తల్లి! తెరపై ఇటువంటి పాత్ర చేయటం లారాకి ఇదే మొదటిసారి. కానీ, నిజ జీవితంలో ఆమె తల్లిగా అయితే కాస్త అనుభవం పొగేసుకోగలిగింది. కూతురు సైరా వేసే షాకింగ్ కొశన్స్ గురించి ఆమె రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పింది. 4 ఏళ్ల వయస్సులో ‘డైవోర్స్’ అంటే ఏంటని అడిగిన లిట్టిల్ గాళ్... కొన్నాళ్ల క్రితం ‘బ్రోతల్’ అంటే ఏంటని ప్రశ్నించిందట! ప్రస్తుతం 9 ఏళ్ల వయస్సున్న కూతురికి ఏం సమాధానం చెప్పాలో లారా దత్తాకి అర్థం కాలేదు. పైగా అటువంటి పదాలు చిన్న పిల్లల చెవుల్లో పడటం మరింత ఆశ్చర్యం కలిగించే పరిణామం అంటోంది బీ-టౌన్ యాక్ట్రస్...


కూతురు ప్రశ్నకి ఖచ్చితంగా ఏం సమాధానం చెప్పిందో లారా వివరించలేదు కానీ... ‘బ్రోతల్’ లాంటి పదం కూతురు చెవుల్లో పడ్డాక తాను మాత్రం అబద్ధం చెప్పనని వ్యాఖ్యానించింది. అబద్ధాలు చెప్పే తల్లిగా తాను మిగలదలుచుకోలేదని అంది. ఎదిగే పిల్లలతో తల్లిదండ్రులు ఇబ్బందికరం కానీ విధంగా చర్చలు కొనసాగించాలని ఆమె అభిప్రాయపడింది. అదే విషయాన్ని తన తాజా వెబ్ సిరీస్ ‘హికప్స్ అండ్ హుకప్స్’లో చూపించామంటోంది...  

Advertisement

Bollywoodమరిన్ని...