రాజధాని నీటి వ్యర్థాల్లో అధిక శాతం వయాగ్రానే!

ABN , First Publish Date - 2021-05-19T05:26:42+05:30 IST

జనాభా ఎక్కువగా ఉన్న పట్టణాల్లో వ్యర్థనీరు కూడా అధికంగానే విడుదల అవుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అందుకే దేశ, రాష్ట్ర రాజధానుల్లో వ్యర్థనీరు ఎక్కువగా విడుదల అవుతుంది.

రాజధాని నీటి వ్యర్థాల్లో అధిక శాతం వయాగ్రానే!

సియోల్: జనాభా ఎక్కువగా ఉన్న పట్టణాల్లో వ్యర్థనీరు కూడా అధికంగానే విడుదల అవుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అందుకే దేశ, రాష్ట్ర రాజధానుల్లో వ్యర్థనీరు ఎక్కువగా విడుదల అవుతుంది. సౌత్ కొరియాలో రాజధాని సియోల్‌లో కూడా ఇదే పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే.. సియోల్‌ నగరంలో విడుదలైన వ్యర్ధనీటిలో అధిక శాతం వయాగ్రా ఉందిట. ఈ విషయం తాజా పరిశోధనలో వెల్లడైంది. వయాగ్రాతోటు ఎరక్టైట్ డిస్‌ఫంక్షన్ చికిత్సలో ఉపయోగించే ఔషధాలే ఎక్కువ శాతం ఈ నీటిలో ఉన్నాయని దక్షిణ కొరియా పరిశోధకులు కనుగొన్నారు. ఇలాంటి డ్రగ్స్ వాడకం వీకెండ్స్‌లో ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు తెలిపారు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే.. ప్రస్తుతం ఉన్న డ్రైనేజి వ్యవస్థ, మనుషులు తీసుకున్న మందులను ఫిల్టన్ చేయడానికి సరిపోదని వాళ్లు తేల్చారు.

Updated Date - 2021-05-19T05:26:42+05:30 IST