Advertisement
Advertisement
Abn logo
Advertisement

తెలంగాణలో భారీ స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. శుక్రవారం రోజు తెలంగాణలో కొత్తగా 2,398 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో 68,525 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. కరోనా వల్ల ముగ్గురు చనిపోయారని, జీహెచ్ఎంసీ పరిధిలో 1,233 కరోనా కేసులు నమోదైనట్లు అధికారులు చెప్పారు.  తెలంగాణ ఇప్పటి వరకు 7,05,199 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య శాఖ వెల్లడించింది. కరోనా వల్ల తెలంగాణ రాష్ట్రంలో 4,052 మంది చనిపోయారని వైద్యశాఖ తెలిపింది.

Advertisement
Advertisement