ఉద్యాన పంటలకు పెద్దపీట

ABN , First Publish Date - 2021-06-19T05:22:03+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యాన పంటల సాగుపై దృష్టి సారించింది.

ఉద్యాన పంటలకు పెద్దపీట

  • వరికి ‘కత్తెర’
  • ఈ మేర ఆరుతడి పంటల సాగు పెంపు
  • కూరగాయ పంటల సాగుకు ప్రాధాన్యం
  • సబ్సిడీపై నారు సరఫరా

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యాన పంటల సాగుపై దృష్టి సారించింది. రంగారెడ్డి జిల్లాలో అధికంగా సాగవుతున్న వరి పంటను తగ్గించి కూరగాయల సాగును పెంచేందుకు చర్యలు చేపట్టింది. కూరగాయలు సాగు చేసే రైతులను ప్రోత్సహిం చేందుకు ఉద్యానశాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. మున్ముందు కూరగాయల కొరత ఉండకుండా వీటి సాగు కోసం రైతులకు సబ్సిడీపై నారు అందివ్వాలని సర్కార్‌ నిర్ణయించింది.


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి) : ఖరీఫ్‌లో వరిసాగును గణనీయంగా తగ్గించాలని సర్కార్‌ నిర్ణ యించింది. దీని స్థానంలో ఇతర పంటలను పెంచేం దుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. పత్తి, మొక్కజొన్న, కందితో పాటు ఉద్యాన పంటల సాగును గణనీయంగా పెంచేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే వ్యవసాయ శాఖ ప్రణాళికలో వరిసాగును గణనీయంగా తగ్గిం చారు. ఇంకా మరింత తగ్గించేందుకు కసరత్తు చేస్తు న్నారు. గత ఖరీఫ్‌తో పోలిస్తే ఈ ఏడాది కనీసం 20 శాతం వరిసాగు తగ్గించేందుకు నిర్ణయించారు. వరికి ప్రత్యామ్నయంగా కూరగాయ పంటలను ప్రోత్సహిం చాలని యోచిస్తున్నారు. రబీలో వరిసాగు భారీగా పెర గడంతో పంట కొనుగోలు చేయడంలో ప్రభుత్వం ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. దీంతో వరిసాగును  తగ్గించి ఆరుతడి పంటలు వేసే విధంగా రైతులను ప్రోత్సహించాలని సర్కార్‌  నిర్ణయించింది. ముఖ్యంగా హైదరాబాద్‌ చుట్టుపక్కల కూరగాయ పంటల సాగు పెంచేందుకు కసరత్తు చేస్తున్నారు. వాస్తవానికి హైదరాబాద్‌ మహానగరవాసులకు సరి పడా కూరగాయలు స్థానికంగా లభించడం లేదు. పొరుగురాష్ట్రాల నుంచి నిత్యం పలురకాల కూరగా యలు నగరానికి సరఫరా అవుతు న్నాయి. అయితే ఇక్కడ కూరగా యలకు డిమాండ్‌ ఉన్నప్పటికీ పలు కారణాల వల్ల రైతులు ఈ పంటలు పండించేందుకు ఆసక్తి చూపడం లేదు. నీటి సమస్య, చీడపీడల బెడద కారణంగా రైతులు సాంప్రదాయ పంటల వైపే మొగ్గు చూపుతున్నారు. అయితే ఈ ఏడాది ఎక్కువ మంది రైతులతో కూరగాయ పంటలు సాగు చేయించేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. గతేడాదితో పోలిస్తే కనీసం 20శాతం అధికంగా కూరగాయ పంటలు సాగు పెంచాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. ఖరీఫ్‌లో వరి సాగును గణనీయంగా తగ్గించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆరుతడి పంటల సాగును పెంచేందుకు కసరత్తు చేస్తోంది. గతేడాది వర్షాలు బాగా కురవ డంతో  ఖరీఫ్‌, రబీలో పంటల సాగు విస్తీర్ణం గణనీ యంగా పెరిగింది. గత ఖరీఫ్‌లో సాగు విస్తీర్ణం 3,99,561 ఎకరాలుగా నిర్ణయించగా రైతులు 4,71,795 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. ఇం దులో అత్యధికంగా 2.73 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. ప్రభుత్వం పత్తి వద్దన్నప్పటికీ రైతులు ఈ పంట వైపే మొగ్గుచూపారు. రబీలో వరి సాగు విస్తీర్ణం భారీగా పెరిగింది. గత ఏడాది రబీలో వరి 36 వేల  ఎకరాల విస్తీర్ణంలో వేయాలని నిర్ణయించగా, సుమారు రెట్టింపు స్థాయిలో 71వేల ఎకరాల్లో సాగు చేశారు. ఈసారి కూడా వర్షపాతం ఆశాజనకంగా ఉం టుందని శాస్త్ర వేత్తలు చెబుతుండడంతో ఖరీఫ్‌, రబీలో పంటలు సాగు మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో 5,24,333 ఎకరాల మేర వివిధ పంటలు సాగు చేయవచ్చని అధికారులు అంచనా వేశారు. గతేడాదితో పోలిస్తే ఈసారి 52,538 ఎకరాలు సాగు పెరగనుంది. అలాగే ఈఏడాది మొత్తం 51,790 ఎకరాల్లో ఉద్యానపంటలు పండించాలని అధికారులు ముందుగా ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే తాజాగా మరో 10వేల ఎకరాలు అదనంగా పెంచేం దుకు కసరత్తు చేస్తున్నారు. ఇందులో కూరగాయ పంటల విస్తీర్ణమే నాలుగువేల ఎకరాలకు పైగా పెంచాలని నిర్ణయించారు. 


60శాతం టమాట

జిల్లాలో సాగయ్యే కూరగాయ పం టల్లో 60శాతం టమాట పంటే ఉం టుంది. దీనికి మార్కెట్‌లో డిమాండ్‌ ఉండడంతో ఈ ఏడాది ఖరీఫ్‌లో కూడా ఎక్కువ విస్తీర్ణంలో టమాట పంట వేసేందుకు రైతులు ఆసక్తి చూపుతు న్నారు. దీంతో ఈమేరకు రైతులకు ట మాట నారు అందించేందుకు అధి కారులు చర్యలు తీసుకుంటున్నారు. 


సబ్సిడీపై నారు 

కూరగాయ పంటల సాగు చేసే రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సబ్సిడీపై నారు అందిస్తోంది. ఈ ఏడాది కూరగాయ పంటల సాగును గణనీయంగా పెంచేందుకు కసరత్తు చేస్తున్నాం. వీటికి సంబంధించిన తుది ప్రణాళిక రూపొందిస్తున్నాం. 4వేల ఎకరా లకుపైగా సాగును పెంచేందుకు ప్రయత్నిస్తున్నాం. కూరగాయ పంటలను ప్రోత్స హించేందుకు జీడిమెట్లలోని నర్సరీ నుంచి తక్కువ ధరకే నారు రైతులకు అందించనున్నాం. టమాట, మిర్చి, వంగ నారును రైతులకు ఇవ్వనున్నాం. 20పైసలకు ఒక మొక్క చొప్పున అందిస్తాం. రవాణా ఖర్చు కూడా ఎకరానికి రూ.వేయి అందిస్తాం. తద్వారా కూరగాయలు పండించే రైతులకు ఎకరానికి సుమారు రూ.12వేల వరకు ప్రయోజనం కలుగుతుంది. 

- సునంద, జిల్లా ఉద్యానశాఖ అధికారి

Updated Date - 2021-06-19T05:22:03+05:30 IST