గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పెద్దపీట

ABN , First Publish Date - 2021-06-22T05:37:11+05:30 IST

గ్రామీణ ప్రాంతాలా అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తెలిపారు.

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పెద్దపీట
రాజాంలో శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న ఎంపీ, ఎమ్మెల్యే

ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ

బుచ్చెయ్యపేట, జూన్‌ 21:
గ్రామీణ ప్రాంతాలా అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తెలిపారు. రాజాంలో రూ.5 లక్షలతో నిర్మించిన కమ్యూనిటీ భవనం, పెదమదీనలో భూగర్భ జలాల పెంపుకు ఉపాధి పథకంలో మంజూరైన రూ.50 లక్షల ప్రాజెక్టు పనులను సోమవారం ఎంపీ డాక్టర్‌ సత్యవతితో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయా గ్రామాల్లో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని ఎంపీ సత్యవతి తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ ఉమామహేశ్వరరావు, ఎంపీడీవో విజయలక్ష్మి, పీఆర్‌ డీఈఈ ప్రసాద్‌, ఏఈఈ ఆనందరావు, ఈవోపీఆర్డీ నారాయణరావు, ఏపీవో మురళీ, డాక్టరు బి.సత్యప్రసాద్‌, వైసీపీ నాయకులు డి.రాంబాబు, కె.అచ్చెంనాయుడు, ఎం.నాని, బి.నారాయణమూర్తి, కె.అప్పలనాయుడు, ఎ.నాగేశ్వరరావు, కేవీఆర్‌ నాయుడు, చొప్పా బాబురావు, జి.శ్రీనివాస్‌యాదవ్‌, బర్ల శివ, ఎన్‌.అప్పలరాజు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-22T05:37:11+05:30 IST