Abn logo
Sep 22 2021 @ 23:39PM

పట్టణాభివృద్ధికి పెద్దపీట : కలెక్టర్‌

కలెక్టర్‌చౌక్‌ వద్ద మీడియన్‌లో మొక్కలు నాటుతున్న కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌

ఆదిలాబాద్‌టౌన్‌, సెప్టెంబరు 22: ఆదిలాబాద్‌ పట్టణ అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ అన్నారు. పట్టణ సుందరీకరణలో భాగంగా బుధవారం డీవైడర్ల మధ్యలో ఆమె మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సుమారు 12 కి.మీల మేర 36కోట్లతో డివైడర్ల పనులు, సెంట్రల్‌ లైటింగ్‌, పచ్చదనం, సుందరీకరణ కోసం మొక్కలు నాటడం జరుగుతుందన్నారు. గ్రీన్‌ బడ్జెట్‌ కింద రూ.కోటి 50లక్షలు మున్సిపల్‌ నిధుల నుంచి వెచ్చించి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు. ఆదిలాబాద్‌ మున్సిపల్‌ పరిధిలో నూతనంగా జంక్షన్ల ఏర్పాటు, సెంట్రల్‌ లైటింగ్‌, ట్రీ పార్కులు, మొబైల్‌ టాయిలెట్లు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.  ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ పట్టణంలో రూ.55 నుంచి రూ.60కోట్లతో సుందరీకరణ పనులు చేపడుతున్నామని, మావల నుంచి చాందా వరకు రూ.46కోట్లతో రోడ్ల నిర్మాణ పనులు, రూ.4.20 కోట్లతో సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ రిజ్వాన్‌భాషా షేక్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మెట్టు ప్రహ్లాద్‌, మున్సిపల్‌ కమిషనర్‌ శైలజ, మున్సిపల్‌ ఈఈ వెంకటసుబ్బయ్య, డీఈ తిరుపతి, ఏఈ అరుణ్‌కుమార్‌, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ రాజేంద్రనాయక్‌, ఈఈ నర్సయ్య, డీఈ సురేష్‌, జేఈ శ్వేత, పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు. 

పలు కాలనీల్లో పర్యటన..

పట్టణంలోని పలు కాలనీల్లో గల పరిసరాలను కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌తో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. ముఖ్యంగా మావల నుంచి చాందా వరకు కొనసాగుతున్న రోడ్డు వెడల్పు, సెంట్రల్‌ లైటింగ్‌ జంక్షన్‌ అనేక అభివృద్ధి కార్యక్రమాలను కలెక్టర్‌, ఎమ్మెల్యే పరిశీలించారు. ప్రజలు సహకరించినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని కలెక్టర్‌ అన్నారు. ఇందులో ఆర్‌అండ్‌బీ, మున్సిపల్‌ అధికారులు, మున్సిపల్‌ కమిషనర్‌ శైలజ, పలువురు కౌన్సిలర్లు ఉన్నారు.