జంతిక తిన్న వర్ధమాన నటికి బ్రెయిన్ డ్యామేజ్.. రూ. 220 కోట్ల పరిహారం

ABN , First Publish Date - 2021-04-12T23:14:27+05:30 IST

ఓ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. అలెర్జిక్ రియాక్షన్‌కు చికిత్స చేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరించి యువతి బ్రెయిన్ దెబ్బతినడానికి కారణమైన

జంతిక తిన్న వర్ధమాన నటికి బ్రెయిన్ డ్యామేజ్.. రూ. 220 కోట్ల పరిహారం

లాస్ వేగాస్: లాస్‌వేగాస్‌లోని ఓ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. అలెర్జిక్ రియాక్షన్‌కు చికిత్స చేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరించి యువతి బ్రెయిన్ దెబ్బతినడానికి కారణమైన అంబులెన్స్ సర్వీసెస్‌ భారీ మూల్యం చెల్లించుకుంది. బాధిత కుటుంబానికి 29.5 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.220 కోట్లు) పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. 27 ఏళ్ల మోడల్, వర్ధమాన నటి అయిన చెండెల్ గియాకలోన్ 2013లో పీనట్ బటర్‌త కలిపిన ప్రెట్‌జెల్‌ను కొరికి తీవ్రమైన అలెర్జిక్ రియాక్షన్‌కు గురైంది. 


అలెర్జీ రియాక్షన్‌కు గురైన గియాకలోన్‌కు లాస్‌వేగాస్‌లోని అంబులెన్స్ సర్వీస్ చికిత్స అందించింది. అయితే, చికిత్సలో తప్పిదం కారణంగా ఆమె మెదడు దెబ్బతింది. గియాకలోన్ తరపు న్యాయవాది క్రిస్టియన్ మోరిస్ తన వాదనలు వినిపిస్తూ ఆ రోజు మెడిసిన్ స్టేషన్ నడుపుతున్న మెడిక్‌వెస్ట్ అంబులెన్స్ చికిత్స అందిస్తున్న సమయంలో ఆమె మెదడుకు కొన్ని నిమిషాలపాటు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయినట్టు కోర్టుకు తెలిపారు.  


తీవ్రమైన అలెర్జిక్ రియాక్షన్‌‌‌కు అడ్రినలిన్ చికిత్స అయిన ఐవీ ఎపినెఫ్రిన్ ఆ రోజు విధుల్లో ఉన్న ఇద్దరు వైద్యుల వద్దా లేదని క్రిస్టియన్ మోరిస్ కోర్టుకు తెలిపారు. తీవ్రమైన అలర్జీ (అనాఫిలాక్సిస్)కు ఐవీ అవసరమైతే ఇంట్రాముస్కలర్ ఎపినెఫ్రిన్‌ను ఇచ్చారని ఆరోపించారు.


ఆ మందు ధర 2.42 డాలర్లు మాత్రమేనని, తన క్లయింట్‌కు అయిన మెడికల్ ఖర్చులు, మానసిక వేదనకు 60 మిలియన్ డాలర్లు ఇప్పించాలని కోర్టును అభ్యర్థించారు. వాదనలు విన్న జ్యూరీ బాధిత కుటుంబానికి 29.5 మిలియన్ డాలర్లు పరిహారంగా చెల్లించాలని అంబులెన్స్ సర్వీస్‌ను ఆదేశించింది.


అయితే, మెడిక్‌వెస్ట్ ఈ ఆరోపణలను కొట్టిపారేసింది. గియాకలోన్ ఎప్పుడూ స్పృహ కోల్పోలేదని అటార్జీ విలియం డ్రురీ కోర్టుకు తెలిపారు. కాగా, జ్యూరీ తీర్పుపై గియాకలోన్ తండ్రి జాక్ సంతోషం వ్యక్తం చేశారు. 8 ఏళ్లపాటు తాము అనుభవించిన బాధలకు ఫుల్‌స్టాప్ పడిందన్నారు. ఇప్పటికైనా మెడిక్‌వెస్ట్ తన తీరు మార్చుకోవాలని సూచించారు.  

Updated Date - 2021-04-12T23:14:27+05:30 IST