Advertisement
Advertisement
Abn logo
Advertisement
Oct 25 2021 @ 17:47PM

‘నదీమార్గ్’ సూత్రధారి జియా ముస్తఫా హతం

శ్రీగనర్: మూడు దశాబ్దాల క్రితం కశ్మీరీ పండిట్లపై జరిగిన ‘నదీమార్గ్’ దాడిలో ప్రధాన సూత్రధాని అయిన లష్కరే తొయిబా ఉగ్ర సంస్థ సభ్యుడు జియా ముస్తఫా తాజాగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. జమ్మూ కశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో రెండు వారాలుగా ఉగ్రమూకలకు భారత జవాన్లకు మధ్య ఎన్‌కౌంటర్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముస్తఫా మరణించినట్లు భారత జవాన్లు తెలిపారు. 2003లో అరెస్టైన ముస్తఫను శనివారమే పోలీసు రిమాండ్‌కు తరలించారు. ఆదివారం అతడిని బాతా దురియా వద్ద ఎన్‌కౌంటర్ ప్రదేశానికి తీసుకెళ్లగా.. దళాల రాకను గుర్తించిన ఉగ్రవాదులు పెద్ద ఎత్తున కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో కొంత మంది జవాన్లు సహా జియా గాయపడ్డాడు. అయితే అతడిని అక్కడి నుంచి తీసుకువచ్చేందుకు దళాలు చేసిన ప్రయత్నం ఫలించలేదు. అతడు ఘటనా స్థలంలోనే మరణించినట్లు దళాలు పేర్కొన్నాయి.


1990ల్లో కశ్మీరీ పండిట్లపై దాడులు జరగడంతో నదీమార్గ్ అనే గ్రామంలో ఉన్న చాలా మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. అయితే గ్రామంలో ఉన్న చాలా మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినప్పటికీ 50 కుటుంబాలు మాత్రం ధైర్యంగా అక్కడే ఉన్నాయి. వారికి తొమ్మిది మంది పోలీసులతో పికెట్ కూడా ఏర్పాటు చేశారు. కొంత కాలం పరిస్థులు బాగానే ఉన్నప్పటికీ ఒక దశాబ్దం తర్వాత ఉగ్రవాదులు రెచ్చిపోయి నదీమార్గ్ గ్రామంపై దాడి చేశారు. ఈ దాడిలో 24 మంది కశ్మీరీ పండిట్లు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 11 మంది పురుషులు, 11 మంది మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఈ దాడి అప్పట్లో ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

Advertisement
Advertisement