మార్చి, ఏప్రిల్ నెల విద్యుత్ బిల్లుల చెల్లింపు గడువు పెంపు

ABN , First Publish Date - 2020-03-27T12:22:54+05:30 IST

కరోనాతో విద్యుత్ బిల్లుల చెల్లింపు విషయంలో గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కీలక నిర్ణయం తీసుకున్నారు.....

మార్చి, ఏప్రిల్ నెల విద్యుత్ బిల్లుల చెల్లింపు గడువు పెంపు

  • గుజరాత్ సీఎం కీలక ఆదేశాలు

గాంధీనగర్(గుజరాత్): కరోనాతో విద్యుత్ బిల్లుల చెల్లింపు విషయంలో గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్ వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ విధించడం వల్ల మార్చి, ఏప్రిల్ నెలల విద్యుత్ బిల్లులను చెల్లించేందుకు గడవుతేదీని మే 15వతేదీ వరకు పొడిగిస్తూ సీఎం విజయ్ రూపానీ ఆదేశాలు జారీ చేశారు. దీంతోపాటు పారిశ్రామికవేత్తలు, దుకాణాల వారికి కూడా అధిక బిల్లులు విధించమని సీఎం చెప్పారు. గుజరాత్ రాష్ట్రంలో కరోనా వైరస్ రోగుల సంఖ్య 43కు చేరుకోవడంతోపాటు ముగ్గురు మరణించిన నేపథ్యంలో సీఎం విద్యుత్ బిల్లుల చెల్లింపును వాయిదా వేశారు. అహ్మదాబాద్ నగరంలో 15 మందికి, సూరత్ లో ఏడుగురికి, రాజ్ కోట్ లో నలుగురికి, గాంధీనగర్ లో ఏడుగురికి, వడోదరలో 8 మందికి, కచ్, భావనగర్ లలో ఒక్కొక్కరికి కరోనా వైరస్ సోకింది. 

Updated Date - 2020-03-27T12:22:54+05:30 IST