కొనసాగుతోన్న బెంగాల్ ఎన్నికల చివరిదశ పోలింగ్

ABN , First Publish Date - 2021-04-29T21:12:52+05:30 IST

ఎన్నడూ లేనంతగా పశ్చిమ బెంగాల్ ఓటర్లు ఓటు వేయడానికి పోటెత్తుతున్నారు. గడిచిన 7 దశల్లోనూ సగటున 80 శాతం పోలింగ్ నమోదైంది. అతి ఎక్కువగా మొదటి దశలో 84.63 శాతం నమోదైంది. తక్కువగా ఏడవ దశలో 76.89 శాతం పోలింగ్

కొనసాగుతోన్న బెంగాల్ ఎన్నికల చివరిదశ పోలింగ్

కోల్‌కతా: బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల చివరిదశ పోలింగ్ గురువారం కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 6 వరకు కొనసాగనుంది. కాగా, మద్యాహ్నం 3 గంటల వరకు 56.28 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. మొత్తం 35 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు నమోదైన పోలింగ్‌లో ఎక్కువగా బిర్భుంలో నమోదైంది. బిర్భుంలో 60.31 శాతం నమోదైంది. ఇక అత్యంత తక్కువగా ఉత్తర కోల్‌కతాలో 41.73 శాతం నమోదైంది.


ఎన్నడూ లేనంతగా పశ్చిమ బెంగాల్ ఓటర్లు ఓటు వేయడానికి పోటెత్తుతున్నారు. గడిచిన 7 దశల్లోనూ సగటున 80 శాతం పోలింగ్ నమోదైంది. అతి ఎక్కువగా రెండవ దశలో 86.11 శాతం నమోదైంది. తక్కువగా ఏడవ దశలో 76.89 శాతం పోలింగ్ నమోదైంది. తాజాగా కొనసాగుతున్న ఎనిమిదవ దశ పోలింగ్ చివరిది. ఈరోజుతో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిపోతాయి. ఇక మే 2న ఫలితాలను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేస్తుంది.

Updated Date - 2021-04-29T21:12:52+05:30 IST