karnataka: మనుషుల్లానే కోతికి అంత్యక్రియలు

ABN , First Publish Date - 2021-08-08T05:36:20+05:30 IST

ఎక్కడ చెడు ఉంటుందో అక్కడ మంచి కూడా ఉంటుంది. ఈ ప్రపంచం ఇంకా నాశనం కాకుండా ఇలా మిగిలి ఉండడానికి..

karnataka: మనుషుల్లానే కోతికి అంత్యక్రియలు

బెంగళూరు: ఎక్కడ చెడు ఉంటుందో అక్కడ మంచి కూడా ఉంటుంది. ఈ ప్రపంచం ఇంకా నాశనం కాకుండా ఇలా మిగిలి ఉండడానికి ఆ మంచే కారణం. ఇలాంటి మాటలు పెద్దల నోటి నుంచి అప్పుడప్పుడూ వింటుంటాం. కానీ తాజాగా కర్ణాటకలో జరిగిన సంఘటన పెద్దల మాటను నిజం చేసింది. ఈ మధ్యనే కర్ణాటకలోని హసన్ ప్రాంతంలో 35 కోతులను అత్యంత దారుణంగా విషయం పెట్టి సంచుల్లో కుక్కి దారుణంగా చంపేసిన ఘటన దేశాన్నే కలచివేసింది. ‘మనం ఎలాంటి సమాజంలో ఉన్నాం..?’ అనే ఆవేదనను ప్రతి ఒక్కరికలో కలిగించింది. అయితే తాజాగా కర్ణాటకలోనే ఓ కోతికి అంత్యక్రియలు జరిపి స్థానికులు తమ గొప్ప మనసును చాటి చెప్పారు. సూరశెట్టికొప్ప అనే గ్రామంలో విద్యుత్ షాక్‌తో చనిపోయిన ఓ కోతికి స్థానికులు అంత్యక్రియలు జరిపారు. మనుషులకు ఎలాగైతే చేస్తారో అదే విధంగా అంత్యక్రియలు నిర్వహించారు.


పూలమాలలో అలంకరించి ఆ తర్వాత ఊరేగింపుగా తీసుకెళ్లి స్థానిక ఓ ఆలయంలో అంత్యక్రియలు నిర్వహించారు. కాగా.. చనిపోయిన కోతి ఈ మధ్యనే రెండు కోతి పిల్లలకు జన్మనిచ్చింది. ఆ కోతులను స్థానికులు అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Updated Date - 2021-08-08T05:36:20+05:30 IST