పీపీఈ కిట్లు ధరించి ఉర్దూ కవికి అంత్యక్రియలు

ABN , First Publish Date - 2020-08-12T11:25:26+05:30 IST

గుండెపోటుతో మరణించిన ఉర్దూ ప్రముఖ కవి, సినీగీతాల రచయిత రహాత్ ఇండోరికి మంగళవారం రాత్రి అంత్యక్రియలు జరిపారు.

పీపీఈ కిట్లు ధరించి ఉర్దూ కవికి అంత్యక్రియలు

ఇండోర్ (మధ్యప్రదేశ్): కొవిడ్-19తో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మరణించిన ఉర్దూ ప్రముఖ కవి, సినీగీతాల రచయిత రహాత్ ఇండోరికి మంగళవారం రాత్రి అంత్యక్రియలు జరిపారు. ఇండోర్ నగరంలోని ఛోటి ఖాజరాణీ శ్మశానవాటికలో కరోనా నిబంధనల ప్రకారం రహాత్ కు అంత్యక్రియలు  చేశారు. అరబిందో ఆసుపత్రి నుంచి అంబులెన్సులో రహాత్ మృతదేహాన్ని పీపీఈ కిట్లు ధరించిన కుటుంబసభ్యులు తీసుకువచ్చి అంత్యక్రియలు జరిపారు. నిమోనియాతో బాధపడుతున్న రహాత్ కు రెండు సార్లు గుండెపోటు వచ్చిందని అరబిందో ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ వినోద్ భండారీ చెప్పారు. పోలీసులు, జిల్లా అధికారులు కూడా పీపీఈ కిట్లు ధరించి వచ్చి రహాత్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. మృతుడు రహాత్ కు భార్య సీమా రహాత్, నలుగురు పిల్లలున్నారు. ప్రముఖ ఉర్దూ కవి అయిన రహత్ ఇండోరి మున్నాభాయ్ ఎంబీబీఎస్, మర్డర్ తదితర సినిమాలకు పాటలు రాశారు. ఈయన రాసిన ఉర్దూ కవితలు, గజల్సు ప్రజాదరణ పొందాయి.

Updated Date - 2020-08-12T11:25:26+05:30 IST