Advertisement
Advertisement
Abn logo
Advertisement

చంద్రబాబు తాతయ్య ఏడుస్తుంటే తట్టుకోలేక ఏడ్చేశా..

కృష్ణా: అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు కుటుంబానికి జరిగిన అవమానంపై అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నేతల తీరుపై ప్రజల నుంచి కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు విలపించిన తీరు చూసిన ఎంతో అభిమానులు కన్నీరు పెట్టారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం చిన్నాపురం గ్రామానికి చెందిన ఓ చిన్నారి చంద్రబాబును చూసి కంటతడి పెట్టింది. లాస్యశ్రీ అనే చిన్నారి టీవీలో చంద్రబాబు విలపిస్తుండగా చూసి బిగ్గరగా ఏడ్చింది. ఈ వీడియో ఏబీఎన్‌లో ప్రసారంకావడంతో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తాతయ్య అంటే తనకు ఎంతో అభిమానమని, ఆయనను అలా చూసే సరికి  ఏడ్పు వచ్చిందని లాస్యశ్రీ తెలిపింది. 

Advertisement
Advertisement