అల్పాహారం మానేస్తే..!

ABN , First Publish Date - 2021-05-27T20:46:39+05:30 IST

బ్రేక్‌ఫాస్ట్‌ అంటే ఉదయం ఎనిమిది గంటలలోపు పూర్తవ్వాలి. కానీ చాలామంది ఇది పాటించరు. పని ఒత్తిడి మూలంగా బ్రేక్‌ఫాస్ట్‌ చేయకుండానే ఆఫీసులకు పరుగెత్తుతుంటారు. కొంతమంది ఆలస్యంగా టిఫిన్‌ చేస్తుంటారు

అల్పాహారం మానేస్తే..!

ఆంధ్రజ్యోతి(27-05-2021)

బ్రేక్‌ఫాస్ట్‌ అంటే ఉదయం ఎనిమిది గంటలలోపు పూర్తవ్వాలి. కానీ చాలామంది ఇది పాటించరు. పని ఒత్తిడి మూలంగా బ్రేక్‌ఫాస్ట్‌ చేయకుండానే ఆఫీసులకు పరుగెత్తుతుంటారు. కొంతమంది ఆలస్యంగా టిఫిన్‌ చేస్తుంటారు. కానీ ఇలా చేయడం వల్ల ఇతర సమస్యలు వచ్చిపడతాయని అంటున్నారు వైద్యులు. 


సమయానికి బ్రేక్‌ఫాస్ట్‌ చేయకపోతే యాసిడ్‌ రిఫ్లక్స్‌ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే కొన్ని గంటలపాటు ఆహారం లేకుండా ఉన్నప్పుడు యాసిడ్‌ విడుదలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎసిడిటీ సమస్య దరిచేరకుండా ఉండాలంటే లైట్‌గానైనా బ్రేక్‌ఫాస్ట్‌ తీసుకోవాలి. 

ఉదయం లేవగానే రక్తంలో షుగర్‌ లెవెల్స్‌ తక్కువ స్థాయిలో ఉంటాయి. వీటిని క్రమబద్ధీకరించడానికి బ్రేక్‌ఫాస్ట్‌ ఉపయోగపడుతుంది. మెటబాలిజం తిరిగి గాడిలో పడటానికి బ్రేక్‌ఫాస్ట్‌ అనేది శరీరానికి ఫ్యూయల్‌ మాదిరిగా ఉపకరిస్తుంది. 

నిద్రలేచినపుడు అందరిలోనూ ఎనర్జీ లెవెల్స్‌ చాలా తక్కువగా ఉంటాయి. ఈ సమయంలో బ్రేక్‌ఫాస్ట్‌ స్కిప్‌ చేస్తే మెదడుకు అవసరమైన పోషకాలు అందకుండా పోతాయి. దీనివల్ల మరింత నీరసపడతారు. పనితీరు సరిగ్గా ఉండాలంటే గ్లూకోజ్‌ తగినంత అవసరం. 

ఉదయాన్నే నీరసంగా అనిపిస్తే వర్క్‌పైన ఫోకస్‌ పెట్టలేరు. పనిపై తగిన శ్రద్ధ పెట్టాలంటే బ్రేక్‌ఫాస్ట్‌ తప్పక తీసుకోవాలి.

బ్రేక్‌ఫాస్ట్‌ను తరచుగా స్కిప్‌ చేసే వారిలో టైప్‌ 2 డయాబెటిస్‌ వచ్చే అవకాశాలు ఎక్కువ. 

ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య మరింత ఎక్కువ.

Updated Date - 2021-05-27T20:46:39+05:30 IST