అంత్యక్రియలు పూర్తయ్యాక.. అతడికి కరోనా ఉందని ఆలస్యంగా చెప్పడంతో..

ABN , First Publish Date - 2020-07-31T18:00:21+05:30 IST

కొవిడ్‌ మృతుడి వివరాలు అందజేయడంలో అధికారులు నిర్లక్ష్యం చేయడంతో కొవిడ్‌ నిబంధనలు పాటించకుండానే గ్రామస్థులు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. మండలంలోని చల్లగరిగ

అంత్యక్రియలు పూర్తయ్యాక.. అతడికి కరోనా ఉందని ఆలస్యంగా చెప్పడంతో..

ఆలస్యంగా కొవిడ్‌ మృతుడి వివరాలు

అంత్యక్రియల అనంతరం అందిన సమాచారం

భయాందోళనలో చల్లగిరిగ గ్రామస్థులు 


చిట్యాల(వరంగల్): కొవిడ్‌ మృతుడి వివరాలు అందజేయడంలో అధికారులు నిర్లక్ష్యం చేయడంతో కొవిడ్‌ నిబంధనలు పాటించకుండానే గ్రామస్థులు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. మండలంలోని చల్లగరిగ గ్రామానికి చెందిన వ్యక్తి (63) ఈ నెల 18న అనారోగ్యానికి గురికాగా ప్రైవేటుగా కొవిడ్‌ పరీక్షలు చేయించుకున్నాడు. పాజిటివ్‌గా తేలడంతో ఎంజీఎం ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. ఎంజీఎం అధికారులు ఈ సమాచారాన్ని జిల్లా, మండల అధికారులకు సకాలంలో ఇవ్వకపోవడంతో బుధవారం రాత్రి గ్రామస్థులు కొవిడ్‌ నిబంధనలు పాటించకుండా అంత్యక్రియలు నిర్వహించారు. 


అంత్యక్రియల అనంతరం గురువారం ఉదంయ మృతుడికి కరోనా సోకినట్లు కొవిడ్‌ సర్వేలైన్స్‌ అధికారులకు సమాచారం అందింది. ఈ విషయం సర్పంచ్‌, గ్రామస్థులకు తెలవడంతో అంత్యక్రియలకు హాజరైన వారందరూ ఆందోళనకు గురవుతున్నారు. అంతిమయాత్రకు సుమారు 80 మంది హాజరుకాగా వారందరు హోం క్వారంటైన్‌లో ఉండాలని సర్పంచ్‌ సూచించారు. గ్రామంలోని అన్ని వార్డుల్లో శానిటైజేషన్‌ చేశారు.

Updated Date - 2020-07-31T18:00:21+05:30 IST