Advertisement
Advertisement
Abn logo
Advertisement
Nov 5 2021 @ 07:25AM

Gujarat: వల్సాద్ పేపరుమిల్లులో ఘోర అగ్నిప్రమాదం

వల్సాద్ (గుజరాత్):దీపావళి పండుగ వేళ గురువారం అర్ద రాత్రి పటాకులు కాలుస్తుండగా వల్సాద్ పేపరుమిల్లులో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. గుజరాత్ రాష్ట్రంలో సంభవించిన అగ్నిప్రమాదంలో నాలుగైదు గంటల పాటు మంటలు రేగాయి. మంటలను ఆర్పేందుకు 20 అగ్నిమాపక వాహనాలను రప్పించారు. శుక్రవారం ఉదయం 7 గంటలవరకు మంటలు వ్యాపించాయి. అగ్నిమాపకశాఖ అధికారులు ఎట్టకేలకు మంటలను ఆర్పారు. ఈ అగ్నిప్రమాద ఘటనలో కోట్లాదిరూపాయల ఆస్తి నష్టం జరిగింది.ఈ అగ్నిప్రమాదానికి కారణం తెలియలేదని, దీనిపై దర్యాప్తు చేస్తున్నామని వాపి అగ్నిమాపకశాఖ అధికారి అంకిత్ లాతే చెప్పారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement