లేట్‌నైట్‌ ఈ స్నాక్స్‌ బెటర్‌!

ABN , First Publish Date - 2021-10-21T05:30:00+05:30 IST

టీవీ చూస్తూ స్నాక్స్‌ లాగించడం అందరూ చేసేదే. కానీ టీవీ చూస్తూ లేట్‌నైట్‌ మెలకువతో ఉండే వాళ్లు స్నాక్స్‌ తీసుకోవచ్చా..

లేట్‌నైట్‌ ఈ స్నాక్స్‌ బెటర్‌!

టీవీ చూస్తూ స్నాక్స్‌ లాగించడం అందరూ చేసేదే. కానీ టీవీ చూస్తూ లేట్‌నైట్‌ మెలకువతో ఉండే వాళ్లు స్నాక్స్‌ తీసుకోవచ్చా? అర్ధరాత్రి స్నాక్స్‌ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదేనా? అంటే ఇదిగో ఈ స్నాక్స్‌ తింటే ఎలాంటి ఇబ్బంది లేదంటున్నారు నిపుణులు. అవేమిటంటే...


  1. అర్ధరాత్రి ఆకలి అనిపిస్తే బెర్రీలు లాగించొచ్చు. బెర్రీలలో ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది. ఇవి పొట్టను నిండుగా ఉన్న ఫీల్‌ను కలిగిస్తాయి. అంతేకాకుండా వీటిలో మెగ్నీషియం ఉంటుంది. ఇది నరాల వ్యవస్థ ప్రశాంతంగా ఉండేలా చూస్తుంది. 
  2.  లేట్‌ నైట్‌ అయినా పీనట్‌ బటర్‌ శాండ్‌విచ్‌ ఎంచక్కా తినొచ్చు. పీనట్‌ బటర్‌లో ఉండే ట్రిప్టోఫాన్‌ మెదడులో మెలటోనిన్‌గా మారుతుంది. ఇది నిద్ర ముంచుకొచ్చేలా చేస్తుంది. ఇందులో పోషకాలు కూడా ఎక్కువే.
  3.  రాత్రుళ్లు ఆకలి అనిపిస్తే తృణధాన్యాలతో చేసిన స్నాక్స్‌ ఏవైనా తీసుకోవచ్చు. అయితే వాటిలో ఉప్పు ఎక్కువగా లేకుండా చూసుకోవాలి.
  4.  తక్కువ క్యాలరీలు ఉండాలి, ఆకలి తీరాలి అంటే క్యారెట్‌ తినడం మేలు. 
  5.  టీవీ చూస్తూ తినే స్నాక్‌ అనగానే పాప్‌కార్న్‌ ముందుగా గుర్తొస్తుంది. ఫైబర్‌ ఎక్కువగా ఉండే పాప్‌కార్న్‌ నిరభ్యంతరంగా తినొచ్చు. అయితే బటర్‌, సాల్ట్‌ లేకుండా చూసుకోవాలి. ఆలివ్‌ ఆయిల్‌తో చేసినవి అయితే మరీ మంచిది. 
  6. బాదం, వాల్‌నట్స్‌ వంటివి తినొచ్చు. వీటిలో ప్రొటీన్లు, మెలటోనిన్‌, మెగ్నీషియం ఉంటాయి. ఇవి తీసుకోవడం వల్ల ఆకలి తీరడంతో పాటు మంచి నిద్ర వస్తుంది.
  7.  ఒక కప్పు వేడి వేడి పాలలో కొద్దిగా పసుపు వేసి తీసుకోవాలి. పాలల్లో క్యాల్షియం, పొటాషియం, విటమిన్‌ - డితో పాటు ఫాస్ఫరస్‌ లభిస్తుంది. పాలకు పసుపు జోడించడం వల్ల శరీరానికి రిలాక్సేషన్‌ అందుతుంది. 

Updated Date - 2021-10-21T05:30:00+05:30 IST