Abn logo
Aug 11 2021 @ 20:24PM

కొత్త Honda Amaze facelift టీజర్ వచ్చేసింది

న్యూఢిల్లీ: ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా కార్ ఇండియా తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త మోడళ్లలో కార్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. భారత మార్కెట్‌లో అద్భుతమైన ఫీచర్లతో హోండా అమేజ్ కారును విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సంస్థ తెలిపింది. కారుకు సంబంధించి తాజా 2021 హోండా అమేజ్ ఫేస్‌లిఫ్ట్ టీజర్ కొత్త ఎల్‌ఈడీ టెయిల్‌ల్యాంప్‌లను విడుదల చేసినట్లు కంపెనీ పేర్కొంది. ఆగస్టు 18వ తేదీన హోండా అమేజ్ ఫేస్‌లిఫ్ట్ కారును విడుదల చేయనున్నారు. హోండా అమేజ్ ఫేస్‌లిఫ్ట్ కార్ల కోసం ఇప్పటికే బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి.