Apr 11 2021 @ 10:56AM

'ఆర్ఆర్ఆర్' లేటెస్ట్ అప్‌డేట్ ఇచ్చిన జక్కన్న..!

దర్శ ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందుతున్న భారీ మల్టీస్టారర్ 'ఆర్ఆర్ఆర్'. ఈ సినిమాలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్, ఎన్టీఆర్ సరసన బ్రిటన్ మోడల్ ఒలివియా మోరిస్ నటిస్తుండగా బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, శ్రీయ శరణ్ సహా పలువురు పాపులర్ నటీ, నటులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకంఫై ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 13న ప్రపంచ వ్యాప్తంగా అన్నీ ప్రధాన భాషలో 'ఆర్ఆర్ఆర్' రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 

కాగా తాజాగా ఈ సినిమా నుంచి అప్‌డేట్ ఇచ్చారు జక్కన్న అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి. 'ఈ రోజు స్టూడియోలో ఒక మేజిక్ జరిగింది' అంటూ చెప్పకనే 'ఆర్ఆర్ఆర్' రీ రికార్డింగ్ జరుగుతున్నట్టు తెలిపారు. ఇక త్వరలోనే 'ఆర్ఆర్ఆర్' మీ ముందుకు రాబోతుంది అంటూ రాజమౌళి, కీరవాణి కలిసి ఉన్న ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేయడం విశేషం. ఈ సినిమాకు రచయిత సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్నారు. బాహుబలి రెండు భాగాల తరవాత జక్కన్న నుంచి రాబోతున్న సినిమా కావడంతో 'ఆర్ఆర్ఆర్'పై  ముందునుంచి భారీ అంచనాలు ఏర్పడిన సంగతి తెలిసిందే.