AP : సంచలనం సృష్టించిన Guntur గ్యాంగ్‌ రేప్‌ కేసులో పురోగతి

ABN , First Publish Date - 2021-09-14T13:21:51+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన గుంటూరు గ్యాంగ్‌ రేప్‌ కేసులో

AP : సంచలనం సృష్టించిన Guntur గ్యాంగ్‌ రేప్‌ కేసులో పురోగతి

గుంటూరు/అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన గుంటూరు గ్యాంగ్‌ రేప్‌ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ నెల 8వ తేదీ రాత్రి జిల్లాలోని మేడికొండూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పాలడుగు గ్రామశివారులో ఓ మహిళపై నలుగురు ఉన్మాదులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన విషయం విదితమే. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు నిందితులను పట్టుకున్నారు. ఈ అఘాయిత్యానికి పాల్పడింది కొర్రపాడు వాసులే అని పోలీసులు గుర్తించారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు.. సాంకేతికపరమైన అంశాల ఆధారంగా కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


కాగా.. శుభకార్యానికి వెళ్ళివస్తున్న భార్యభర్తల్ని అటకాయించి ఆమె భర్తను కొట్టి, కట్టేసి అతని ముందే నలుగురు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ ఘటన జరిగిన ప్రదేశానికి సమీపంలో నిర్మాణంలో ఉన్న కోల్డ్‌స్టోరేజీలో పని చేస్తున్న ఒడిశా, విజయనగరం ప్రాంతాలకు చెందిన కార్మికులను పోలీసులు తొలుత అనుమానించారు. వారిని అన్ని కోణాల్లో విచారించినా ఏ  ఆధారాలూ లభ్యం కాలేదు. అత్యాచారానికి ఒడిగట్టింది వారు కాదని ఇప్పటికే ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. అలా ఈ కేసు విషయం నాలుగైదు రోజులు జాప్యం జరిగింది. దీంతో మంగళవారం నాడు ఎట్టకేలకు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - 2021-09-14T13:21:51+05:30 IST