Jul 3 2021 @ 13:28PM

'ఆర్‌ఆర్‌ఆర్‌' పాటల చిత్రీకరణలో జక్కన్న మాస్టర్ ప్లాన్

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ కాంబినేషన్‌లో దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి రూపొందిస్తోన్న ప్రెస్టీజియస్‌ మూవీ 'ఆర్‌ఆర్‌ఆర్‌(రణం రౌద్రం రుధిరం)'. భారీ అంచనాలతో తెరకెక్కుతోన్న ఈ చిత్రం టాకీ పార్ట్‌ అంతా పూర్తయ్యింది. రెండు పాటలు చిత్రీకరణ చేయాల్సి ఉంది. ఈ పాటలను ఎప్పుడు చిత్రీకరిస్తారనే దానికి సంబంధించి ఆసక్తికరమైన విషయమొకటి తెలిసింది. అదేంటనే విషయంలోకి వెళితే..రెండు పాటల్లో ఓ పాటను ఈ నెలలో హైదరాబాద్‌లోనే చిత్రీకరిస్తారట. భారీ సెట్‌ వేసి చిత్రీకరించబోయే ఈ పాటలో ఎన్టీఆర్‌, చరణ్‌లతో పాటు అలియా భట్‌ కూడా నటిస్తారని సమాచారం. అయితే రెండో పాటను మాత్రం విదేశాల్లోనే చిత్రీకరిస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఉక్రెయిన్‌ దేశంలో ఎన్టీఆర్‌, ఒలివియా మోరిస్‌లపై ఈ పాట చిత్రీకరణ ఉంటుందని తెలిసింది. రాజమౌళి దీనికి సంబంధించిన లొకేషన్స్‌ పరిశీలన కూడా చేసుకుని వచ్చారు. జూలై చివరి వారం లేదా ఆగస్ట్‌లో ఉక్రెయిన్‌లో పాటను చిత్రకరించేలా ప్లాన్స్‌ జరుగుతున్నాయి. ప్రస్తుతం సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అన్ని అనుకున్నట్లు జరిగితే ఆర్‌ఆర్‌ఆర్‌ను ఈ ఏడాది దసరా సందర్భంగా అక్టోబర్‌ 13న విడుదల చేస్తారు. డి.వి.వి.దానయ్య నిర్మిస్తోన్న ఈ భారీ ఫిక్షనల్‌ పీరియాడికల్‌ డ్రామాలో బాలీవుడ్‌ స్టార్ అజయ్‌ దేవగణ్‌, కోలీవుడ్‌ వెర్సటైల్‌ యాక్టర్‌ సముద్రఖనిలతో పాటు హాలీవుడ్‌ స్టార్స్‌ రే స్టీవెన్‌ సన్‌, అలిసన్‌ డూడి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.