లారస్‌ లాభం రూ.172 కోట్లు

ABN , First Publish Date - 2020-07-31T07:41:13+05:30 IST

జూన్‌ త్రైమాసికంలో లారస్‌ ల్యాబ్స్‌ రూ.172 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటిచింది.

లారస్‌ లాభం రూ.172 కోట్లు

  • రూ.2 ముఖ విలువతో షేరు విభజన


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): జూన్‌ త్రైమాసికంలో లారస్‌ ల్యాబ్స్‌   రూ.172 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటిచింది. ఏడాది క్రితం ఇదే కాలం లాభం రూ.15.10 కోట్లతో పోలిస్తే 1047 శాతం పెరిగింది. కార్యకలాపాల ద్వారా లభించిన ఆదాయం 77 శాతం వృద్ధితో రూ.974 కోట్లకు చేరినట్లు లారస్‌ ల్యాబ్స్‌ సీఈఓ సత్యనారాయణ చావా తెలిపారు. షేరుకు ఆర్జన (ఈపీఎస్‌) రూ.16.1 ఉంది. కొవిడ్‌ కారణంగా సవాళ్లు ఎదురైనప్పటికీ.. రూ.10 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరును రూ.2 ముఖ విలువ కలిగిన అయిదు షేర్లుగా విభజించడానికి బోర్డు ఆమోదం తెలిపింది. సెప్టెంబరు 30 తేదీని రికార్డు తేదీగా నిర్ణయించారు. 

Updated Date - 2020-07-31T07:41:13+05:30 IST