Abn logo
Mar 17 2020 @ 16:53PM

పెళ్లి చేసుకున్నానన్న వ్యక్తిపై లావణ్య త్రిపాఠి ఫిర్యాదు

Kaakateeya

హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఒక వ్యక్తిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సునిశిత్ అనే వ్యక్తి తనను పెళ్లి చేసుకున్నానని అసత్య ప్రచారం చేస్తున్నట్లుగా ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయమై రాతపూర్వక ఫిర్యాదును ఆమె తన అసిస్టెంట్‌ ద్వారా ఏసీపీ కెవిఎమ్ ప్రసాద్‌కు అందజేశారు. అయితే ఆమె ఈ ఫిర్యాదు చేయడానికి గల కారణం చిన్న విషయం కాదు. సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా లావణ్య త్రిపాఠిని సునిశిత్ అనే వ్యక్తి టార్గెట్ చేస్తుండటంతో.. విసిగిపోయిన ఆమె ఇలా ఫిర్యాదు చేశారని తెలుస్తుంది.


ఫేమస్ అవ్వడం కోసమేనా..

మైక్ కనబడితే చాలు అడ్డదిడ్డంగా మాట్లాడి ఎలాగోలా ఫేమస్ అయిపోవాలని ఈ మధ్య కొందరు భావిస్తున్నారు. దానికి ఉదాహరణ ఎవరో కూడా ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఫేమస్ అయిన తర్వాత ఎవరినీ లెక్క చేయకుండా ఇష్టం వచ్చినట్లు ట్వీట్లు, పోస్ట్‌లు చేయడం వంటివి ఈ మధ్య రెగ్యులర్‌గా జరుగుతున్న విషయాలే. ఒకవేళ వారిని ఎవరైనా ఏమైనా అంటే మాత్రం ఇది మా భావ ప్రకటనా స్వేచ్ఛ అంటూ బుకాయించడం వంటివి కొందరి విషయంలో అందరికీ తెలిసిన విషయాలే. అయితే దీనికి అంతే లేకుండా పోతుంది. ఒకరిని చూసి మరొకరు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు. వారే ఫేమస్ అవ్వగా లేనిది నేను అవ్వలేనా అని భావిస్తూ.. సోషల్ మీడియాని ఉపయోగించుకుని.. పొలిటికల్ లీడర్స్‌ని, సమాజంలో కాస్త పేరున్న పెద్దలని, హీరోహీరోయిన్‌లని టార్గెట్ చేస్తూ వారిపై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి వార్తల్లో నిలుస్తున్నారు. అలాంటి కోవలోకే ఇప్పుడు సునిశిత్ అనే వ్యక్తి చేరాడు. 


ఈ మధ్య విపరీతంగా పుట్టుకొచ్చిన యూట్యూబ్ ఛానళ్లలో ఇంటర్వ్యూలు ఇస్తూ.. మహేష్ బాబు, రవితేజ వంటి హీరోలు నాకొచ్చిన అవకాశాలను కొట్టేశారంటూ వింతవింతగా మాట్లాడిన సునిశిత్, హీరోలనే కాకుండా హీరోయిన్లను కూడా అతని అరాచకంలోకి లాగాడు. హీరోయిన్స్ లావణ్య త్రిపాఠి, తమన్నాలను పెళ్లి చేసుకుని, వదిలేశానని యూట్యూబ్ ఛానళ్లలో ఒకటే సోదిగా చెప్పుకొచ్చిన సునిశిత్ నిజంగానే ఇప్పుడు ఫేమస్ అయిపోయాడు. యూట్యూబ్ ఛానళ్లలో ఇతని వాగుడు చూసిన లావణ్య త్రిపాఠి విసిగిపోయి, అతనిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement
Advertisement
Advertisement