విపక్షాల ప్రివిలేజ్ నోటీసులపై గొగోయ్ ఏమన్నారంటే..!

ABN , First Publish Date - 2021-12-15T21:49:52+05:30 IST

విపక్ష పార్టీలు పలువురు తనపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇస్తుండటంపై రాజ్యసభ..

విపక్షాల ప్రివిలేజ్ నోటీసులపై గొగోయ్ ఏమన్నారంటే..!

న్యూఢిల్లీ: విపక్ష పార్టీలు పలువురు తనపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇస్తుండటంపై రాజ్యసభ సభ్యుడు, మాజీ సీజేఐ రంజన్ గొగోయ్ స్పందించారు. ''చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది'' అని గొగోయ్ పేర్కొన్నట్టు ఒక వార్తా సంస్థ తెలిపింది.  తాను ఈ రోజు (బుధవారం) పార్లమెంటుకు హాజరుకావడం లేదని, గురువారం హాజరవుతారని గొగోయ్ తెలిపారు. రాజ్యసభకు గొగోయ్ ఇటీవల నాటిమేట్ అయ్యారు.


రంజన్ గొగోయ్ ఒక ప్రైవేటు ఛానెల్‌కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో పార్లమెంటు గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. టీఎంపీసి చెందిన ఇద్దరు ఎంపీలు  సోమవారంనాడు ఆయనపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. ఈ నోటీసుపై రాజ్యసభ సెక్రటేరియట్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ ఇద్దరు ఎంపీలతో పాటు మరికొందరు విపక్ష ఎంపీలు గొగోయ్‌పై సభాహక్కుల ఉల్లంఘన నోటీసుకు సిద్ధమవుతున్నట్టు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.


పార్లమెంటుకు హాజరుకావడంపై గొగోయ్ ఒక ఛానెల్‌తో మాట్లాడుతూ, తాను నామినేట్ మెంబర్‌ను అని, తనకు నచ్చినపుడు పార్లమెంటుకు వెళ్తానని, సమస్యలు లేవనెత్తుతానని అన్నారు. ఈ వ్యాఖ్యలను పలువురు విపక్ష నేతలు తప్పుపట్టారు. ''పార్లమెంటు అంటే మాట్లాడటం కాదు...వినడం కూడా''అని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ వ్యాఖ్యానించారు. గొగోయ్ వ్యాఖ్యలు పార్లమెంటును అవమానించేలా ఉన్నాయని పేర్కొన్నారు.

Updated Date - 2021-12-15T21:49:52+05:30 IST