Abn logo
Apr 9 2020 @ 19:51PM

రజినీ సినిమాలో లారెన్స్.. కరోనా రిలీఫ్‌కు రూ. 3 కోట్లు

రాఘవ లారెన్స్ సేవా కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆపదలో ఉండి ఎవరైనా తన తలుపు తడితే చాలు.. వారికి తన చేతనైనంతగా సహాయం చేయడంలో లారెన్స్ ముందుంటాడు. ఇప్పటికే ఎందరికో గుండె ఆపరేషన్లు చేయించిన లారెన్స్ ఏ విపత్తు వచ్చినా ముందుండి అధిక మొత్తం విరాళాలు ఇస్తుంటాడు. ప్రస్తుతం కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు కూడా లారెన్స్ భారీ విరాళం ప్రకటించారు. తదుపరి తను చేయబోయే చిత్రానికి సంబంధించి అడ్వాన్స్ అందగానే రూ. 3 కోట్లను విరాళంగా ఇస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నట్లుగా లారెన్స్ ప్రకటించారు. ట్విట్టర్ ద్వారా ఎవరెవరికి ఎంతెంత విరాళం ఇవ్వనున్నాడో కూడా లారెన్స్ ఈ సందర్భంగా తెలియజేశాడు.


‘‘నా స్నేహితులు, అభిమానులతో నేనొక సంతోషకరమైన వార్తను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను నా తలైవర్ రజినీకాంత్ తదుపరి చిత్రం ‘చంద్రముఖి2’లో నటించబోతున్నాను. రజినీకాంత్‌గారి అనుమతి, ఆశీస్సులతో ఈ చిత్రంలో నటించబోతున్నందుకు నేను చాలా అదృష్టవంతుడిగా ఫీలవుతున్నాను. పి. వాసు దర్శకత్వంలో రూపుదిద్దుకోబోతున్న ఈ చిత్రాన్ని నేను ఎంతో ఇష్టపడే సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్‌గారు నిర్మిస్తున్నారు. నేను ఆ చిత్రం నుంచి పొందే అడ్వాన్స్‌తో, కరోనా వైరస్ రిలీఫ్ ఫండ్‌గా 3 కోట్లు విరాళంగా ఇస్తానని వినయంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను.

అందులో రూ. 50 లక్షలు పీఎం కేర్స్ ఫండ్‌కు, రూ. 50 లక్షలు తమిళనాడు సీఎం రిలీఫ్ ఫండ్‌కు, రూ. 50 లక్షలు ఫిల్మ్ ఎంప్లాస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియాకు, అలాగే డ్యాన్సర్స్ యూనియన్‌కు నా తరుపు నుంచి రూ. 50 లక్షలు, నా దగ్గర ఉన్న దివ్యాంగులకు రూ. 25 లక్షలు మరియు నేను పుట్టిన రోయపురం-దేశీయనగర్‌లోని రోజూ పని చేస్తేనే కానీ పూట గడవని కార్మికులకు రూ. 75 లక్షలు విరాళంగా ఇవ్వనున్నాను. నేను అందించే ఆహార, నిత్యావసర వస్తువులన్నీ పోలీసుల సహాయంతో సురక్షితంగా అందజేయడం జరుగుతుంది. సేవే దైవం..’’ అని లారెన్స్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.


Advertisement
Advertisement
Advertisement