కార్మికుల స్వేచ్ఛను హరించే చట్టాలను రద్దుచేయాలి

ABN , First Publish Date - 2021-12-06T07:14:13+05:30 IST

ఎన్నో పోరాటాల ఫలితంగా కార్మికులు సాధించుకున్న హక్కులు, స్వేచ్ఛను కాలరాసే చట్టాలను రద్దు చేయాలని తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు అంబటి నాగయ్య అన్నారు.

కార్మికుల స్వేచ్ఛను హరించే చట్టాలను రద్దుచేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న నాగయ్య

 తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు అంబటి నాగయ్య

మిర్యాలగూడ, డిసెంబరు 5: ఎన్నో పోరాటాల ఫలితంగా  కార్మికులు సాధించుకున్న హక్కులు, స్వేచ్ఛను కాలరాసే చట్టాలను రద్దు చేయాలని తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు అంబటి నాగయ్య అన్నారు. స్థానిక గ్రంథాలయంలో ‘కార్మిక చట్టాల సవరణ-పరిణామాలు’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో మాట్లాడారు. పారిశ్రామిక విప్లవం ప్రభావంతో ప్రపంచంలో అనేక సంక్షేమ చట్టాలకు రూపకల్పన జరిగిందన్నారు. నిర్ణీత పనిగంటలు, సమాన పనికి సమాన వేతనం వాటినుంచే వచ్చాయన్నారు. కార్మికుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. సమావేశంలో మట్టిమనిషి పాండురంగారావు, యూనియన్‌ నాయకులు  రామయ్య, శంకర్‌గౌడ్‌, కోటేశ్వరరావు, సుధాకర్‌, ఖలీల్‌, పోస్టల్‌ సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-06T07:14:13+05:30 IST