మాజీ మంత్రి మనేకాగాంధీపై మణప్పురం న్యాయవాది ఫిర్యాదు

ABN , First Publish Date - 2020-06-05T17:51:01+05:30 IST

ఏనుగు మృతి విషయంలో కేరళ రాష్ట్రంలో మణప్పురం జిల్లాతోపాటు నివాసితులపై కేంద్ర మాజీమంత్రి మనేకాగాంధీ ద్వేషపూరిత ప్రచారం చేశారని ఓ న్యాయవాది పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన

మాజీ మంత్రి మనేకాగాంధీపై మణప్పురం న్యాయవాది ఫిర్యాదు

మణప్పురం(కేరళ): కేంద్రమంత్రి మనేకాగాంధీపై ఓ న్యాయవాది పోలీసులకు ఫిర్యాదు చేాశారు. ఏనుగు మృతి విషయంలో కేరళ రాష్ట్రంలో మణప్పురం జిల్లాతోపాటు నివాసితులపై  కేంద్ర మాజీమంత్రి మనేకాగాంధీ ద్వేషపూరిత ప్రచారం చేశారని ఓ న్యాయవాది పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన వెలుగుచూసింది. పాలక్కాడ్ జిల్లాలోని మన్నార్ కాడ్ లో దురదృష్టవశాత్తు ఏనుగు మరణించిన ఘటనపై ముస్లిములు అధికంగా ఉన్న మణప్పురంపై సోషల్ మీడియాలో ద్వేషం వ్యాప్తి చేయడానికి ఓ సమూహం దీనికి మతపరమైన రంగు చేర్చిందని మణప్పురానికి చెందిన న్యాయవాది సుభాష్ చంద్రన్ అలవయ్యర్ పోలీసు సూపరింటెండెంట్ కు ఫిర్యాదు చేశారు. మణప్పురం జిల్లాతోపాటు నివాసితులపై ద్వేషపూరిత ప్రచారం చేసిన మనేకాగాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సుభాష్ పోలీసులను కోరారు. ఏనుగు పాలక్కాడ్ లో మే 29న పేలుడు పదార్థాలు కూర్చిన ఫైనాపిల్ తిని మరణించిందని, కాని ఈ ఘటనలో మైనారిటీవర్గాలకు వ్యతిరేకంగా ద్వేషపూరిత ప్రచారం చేసిన వారిలో తారెక్ ఫతాహ్ కూడా ఉన్నారని న్యాయవాది పోలీసులకు సమర్పించిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మనేకాగాంధీ మణప్పురం జిల్లా నివాసితులపై తప్పుడు ఆరోపణలు చేసినందున భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 153 ఎ, 120 బిల ప్రకారం ఆమెపై కేసు నమోదు చేయాలని చంద్రన్ జిల్లా ఎస్పీని కోరారు. 

Updated Date - 2020-06-05T17:51:01+05:30 IST