Abn logo
Jun 2 2021 @ 10:15AM

వాహనాలు నిలిపివేయడంపై హైకోర్టులో పిల్

అమరావతి:  కర్ఫ్యూ నేపథ్యంలో తెలంగాణ బోర్డర్‌లో ఏపీ న్యాయవాదులను నిలిపివేయడంపై న్యాయవాది డీఎస్ యన్‌వి ప్రసాద్ బాబు  సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌కు ఇంకా మూడేళ్లు ఉందని పిటిషనర్ తరుపు న్యాయవాది పేర్కొన్నారు. తెలంగాణ బోర్డర్‌లో ఏపీ న్యాయవాదులను నిలిపివేయడంతో సాధనకు ఇబ్బందిగా మారిందన్నారు. ఏపీ, తెలంగాణలో కార్యాలయాలు ఉన్నాయని, రాకపోకలు నిలిపివేయడంతో ఇబ్బందులకు గురవుతున్నామని ప్రసాద్ బాబు అన్నారు. అయితే తెలంగాణ బోర్డర్ లో  ఏపీ న్యాయవాదులను ఎందుకు నిలిపివేస్తున్నారో గురువారం తెలంగాణ ధర్మాసనం ముందు ఉంచుతామని తెలంగాణ ప్రభుత్వ ఏజి స్పష్టం చేశారు.