‘న్యాయవాదుల హత్య కేసును సీబీఐకి అప్పగించాలి’

ABN , First Publish Date - 2021-02-24T04:42:25+05:30 IST

ఇటీవల జరిగిన న్యాయవాద దంపతుల హత్య జరిగిన ప్రదేశాన్ని మంగళవారం ఉమ్మడి జిల్లా న్యాయవాదులు సందర్శించారు.

‘న్యాయవాదుల హత్య కేసును సీబీఐకి అప్పగించాలి’
న్యాయవాదుల కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న దృశ్యం

నిజామాబాద్‌ లీగల్‌, ఫిబ్రవరి 23 : ఇటీవల జరిగిన న్యాయవాద దంపతుల హత్య జరిగిన ప్రదేశాన్ని మంగళవారం ఉమ్మడి జిల్లా న్యాయవాదులు సందర్శించారు. అనంతరం వారి స్వగ్రామానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ సభ్యులు ఎం.రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ న్యాయవాదులను పట్టపగలు కిరాతకంగా హత్యచేసిన కేసును సీబీఐకి అప్పగించి న్యాయ విచారణ జరపాలన్నారు. అసలు సూత్రధారులను గుర్తించి కఠినంగా శిక్షించాలన్నారు. అసలు సూత్రదారులను చూపకుండా కేవలం హత్యచేసిన వారినే చూపుతూ కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. వామన్‌రావ్‌ కుటుంబ సభ్యులను పరామర్శించిన వారిలో జిల్లాలోని ఆర్మూర్‌, బోధన్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు గోవర్ధన్‌, పరుచూరి శ్రీధర్‌,  ఎం.కే నరేంధర్‌, మహ్మద్‌ మోయినోద్దిన్‌, లక్ష్మణ్‌రావ్‌తో పాటు న్యాయవాదులు వెంకటరమణాగౌడ్‌, అమరేందర్‌, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లా నుంచి మొత్తం 160 మంది న్యాయవాదులు తరలివెళ్లారు.

గుంజ పండుకు తరలిన న్యాయవాదులు

బోధన్‌రూరల్‌ : ఇటీవల దారుణంగా హత్యకు గురైన హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్‌రావు, నాగమణి దంపతుల స్వగ్రా మమైన గుంజ పండుకు బోధన్‌ బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మంగళవారం తరలివెళ్లారు. ఈ ఘటనకు కారణమైన వారిని కఠినం గా శిక్షించాలని న్యాయవాదులు డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఈశ్వర్‌, సమ్మయ్య, మహమూద్‌, కోటేశ్వర్‌రావు, అర్జున్‌ రాండర్‌, శ్రీనివాస్‌, వాజీద్‌హుస్సేన్‌, రాహుల్‌, అజయ్‌ తదితరులు పాల్గొన్నారు. 

హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి

ఎడపల్లి: న్యాయవాది వామన్‌రావు దంపతులన హత్యకు నిరసనగా ఎడపల్లి అంబేద్కర్‌ విగ్రహం వద్ద మంగళవారం ఎంఆర్‌పీఎస్‌ ఆధ్వ ర్యంలో ధర్నా నిర్వహించారు. నిందితులను వెంటనే ఉరి తీయాలని వారు కోరారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు పోశన్న, కోండ్ర పాండు, ఎంఆర్‌పీఎస్‌ నాయకులు నాగరాజు, సాయిలు, కుమార్‌, గంగాదర్‌, రాజు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-24T04:42:25+05:30 IST