చంద్రబాబు దీక్షకు నేతల సంఘీభావం

ABN , First Publish Date - 2021-10-22T05:41:42+05:30 IST

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గు రువారం తలపెట్టిన 36 గంటల దీక్షకు మద్దతుగా పర్చూరు నియో జకవర్గం నుంచి పెద్ద ఎత్తున తెలుగు తమ్ముళ్లు తరలివెళ్లారు.

చంద్రబాబు దీక్షకు నేతల సంఘీభావం
చంద్రబాబు దీక్షకు మద్దతుగా అమరావతి వెళ్లిన మార్టూరు టీడీపీ నేతలు

 భారీగా తరలివెళ్లిన తెలుగు తమ్ముళ్లు

పర్చూరు, అక్టోబరు 21: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గు రువారం తలపెట్టిన 36 గంటల దీక్షకు మద్దతుగా పర్చూరు నియో జకవర్గం నుంచి పెద్ద ఎత్తున తెలుగు తమ్ముళ్లు తరలివెళ్లారు. తొలు త ఏలూరి వద్దకు చేరుకుని అక్కడ నుంచి దీక్షా శిబిరం వద్దకు వెళ్లా రు. ముందుగా కేంద్ర కార్యాలయం వద్దకు చేరుకున్న బాపట్ల పార్ల మెంట్‌ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు చంద్రబాబుకు బాసటగా నిలిచారు. 

మార్టూరు: అమరావతిలో గురువారం నిరసన దీక్ష చేపట్టిన మాజీ సీఎం చంద్రబాబు దీక్షా సభకు మండలం నుంచి భా రీగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు. ఉదయాన్నే కొంత మంది నాయకులు వివిధ వాహనాల్లో తరలివెళ్లారు. సాయంత్రం కొన్ని వాహనాలలో కార్యకర్తలు వెళ్లారు. మండలంలో దాదాపుగా 65 వాహనాలలో నాయకులు చంద్రబాబు దీక్షకు మద్దతుగా వెళ్లారు. తర లివెళ్లిన వారిలో షేక్‌ రజాక్‌, పోపూరి శ్రీనివాసరావు, తొండెపు ఆది నారాయణ, శివరాత్రి శ్రీను, శానంపూడి చిరంజీవి, మి న్నెకంటి రవి, కామినేని జనార్దన్‌, జంపాని సాంబశివరావు, పెంటాల శ్రీను, తదితరులు ఉన్నారు.

యద్దనపూడి మండలం నుంచి 42 వాహనాలలో అమరా వతికి టీడీపీ నాయకులు తరలివెళ్లారు. పార్టీ మండల అధ్యక్షుడు నన్నపనేని రంగయ్య చౌదరి, రావిపాటి సీతయ్య,, కనపర్తి నాగేశ్వర రావు, గుదే తారకరామారావు, ఇంటూరి మురళి, తదితరులు తరలివెళ్లారు.

దాడులు, దౌర్జన్యాలకు భయపడం:ఏలూరి

పర్చూరు, అక్టోబరు 21: దాడులు, దౌర్జన్యాలకు టీడీపీ శ్రేణులు భయపడరని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పేర్కొన్నారు. మరింత కసిగా పార్టీ పటిష్ఠతకు కృషి చేస్తారని చెప్పారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై వైసీపీ గుండాల దాడిని నిరసిస్తూ అధినేత చంద్రబాబు దీక్షకు మద్దతు తెలుపుతూ మాట్లాడారు. కోట్లాది ప్రజల నమ్మకం చూరగొన్నది తెలుగుదేశం పార్టీ అని అన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రజల ఆత్మగౌరవ ప్రతీకన్నారు. ప్రజాస్వామ్యంపై దాడి చేయటం దుర్మార్గపు చర్యగా ఏలూరి అభివర్ణించారు. 22 ఏళ్ల పాటు రాష్ట్ర భవిష్యత్‌కు, ప్రజల అభివృద్దికి పనిచేసిందని గుర్తుచేశారు. అటువంటి పార్టీ కార్యాలయంపై దాడిచేయటం దుర్మార్గపు చర్య అన్నారు. అధినేత చంద్రబాబుకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి దన్యవాదాలు అన్నారు. 151 మంది ఎమ్మెల్యేలు గెలిచిన ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి చేసింది ఏమిలేదన్నారు. ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి చంద్రబాబు నాయుడని చెప్పారు. వందల వేల లక్షల యువకులను తీర్చిదిద్దిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. వైసీపీ ప్రభుత్వంతో అంధకారం తప్పా ప్రజలకు ఒరిగింది ఏమి లేదన్నారు.  

చంద్రన్న పోరులో మేము సైతం అంటూ తెలుగుదేశం పార్టీ బాప ట్ల పార్లమెంట్‌ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆధ్వ ర్యంలో పర్చూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల పరిధిలో 200 కార్లలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు  పె ద్ద సంఖ్యలో దీక్షకు హాజరయ్యారు. చంద్రబాబుకు సంఘీభావం తెలి పారు. బాబు తోడుగా మేము సైతం అంటూ పార్టీ కార్యాల యంలోనే ఎమ్మెల్యే ఏలూరితో కలసి రాత్రంతా గడిపేందుకు నియోజకవర్గం నుంచి తరలివెళ్లారు. 

Updated Date - 2021-10-22T05:41:42+05:30 IST