Abn logo
Jan 27 2021 @ 00:45AM

అభివృద్ధి, సంక్షేమంలో ముందంజ

జిల్లా ప్రజలను ఉద్ధేశించి ప్రసంగిస్తున్న స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

- కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొన్నాం 

- దశలవారీగా అందరికీ వ్యాక్సిన్‌ 

- గణతంత్ర వేడుకల్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో జిల్లా ముందంజలో ఉన్నదని స్థానిక సంస్థల అదనపు కలెక్ట ర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. మంగళవారం పెద్దపల్లి పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో జరిగిన గణతంత్ర వేడుకల సందర్భంగా ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరిం చారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవవందనాన్ని స్వీకరించి జిల్లా ప్రజలను ఉద్ధేశించి ప్రసంగించారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనాను అరికట్టేందు కు జిల్లాలోని సంబంధిత శాఖల అధికారులు, సిబ్బం ది విశేష కృషి చేశారన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 1,59,183మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 5,756 మందికి సోకిందన్నారు. ఇందులో 48మంది మృతిచెం దగా 5,417 మంది వ్యాధి బారినుంచి కోలుకున్నారని, మిగతావారికి వైద్యం అందిస్తున్నామన్నారు. గోదావరి ఖని, సుల్తానాబాద్‌ ఆసుపత్రులను కొవిడ్‌ ఆసుపత్రు లుగా తీర్చిదిద్ది వైద్యం అందించామన్నారు. సుల్తానా బాద్‌లో ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నా రు. లాక్‌డౌన్‌లో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసి టెలి మెడిసిన్‌ అందజేశామన్నారు. కరోనా బారినుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతున్నా మన్నారు. వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడంతో మొదటి దశలో ప్రభుత్వ, ప్రైవేట్‌ఆసుపత్రుల సిబ్బందికి, అంగన్‌వాడీ కార్యకర్తల కు వ్యాక్సిన్‌ ఇచ్చామన్నారు. దశల వారీగా జిల్లా ప్రజ లందరికీ వ్యాక్సిన్‌ అందిస్తామన్నారు. వ్యాక్సిన్‌ వచ్చినా కూడా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటిం చాలని, శానిటైజర్‌ వాడాలని సూచించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవించిన3,145 మందికి కేసీఆర్‌ కిట్లను అందజేశామన్నారు. సాగు నీటిని అందించే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసుకు న్నామని, ప్రతి ఇంటికి నల్లా ద్వారా రక్షిత మంచినీ టిని అందిస్తున్నామన్నారు. జిల్లాలోని 300 అవాసా లకు స్టెబిలైజేషన్‌ పనులు జరిగాయన్నారు. 

రైతుల ఖాతాల్లో రూ.132.73కోట్లు జమ

కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం రై తుబంధు పథకం ద్వారా యాసంగి పంటకు 1,28,865 మంది రైతుల ఖాతాల్లో 132.73 కోట్ల రూపాయలను జమ చేశామన్నారు. ప్రధాని కిసాన్‌ సమ్మాన్‌ నిధి ద్వారా 58,329 మంది రైతులకు 11.66 కోట్లు అందిం చామన్నారు. రైతుబీమా పథకం కింద ఇప్పటివరకు మర ణించిన 779మంది రైతుల కుటుంబాలకు 38.95 కోట్లు అందించామన్నారు. రైతులకు సకాలంలో ఎరు వులు, విత్తనాలు అందించామని, 54 క్లస్టర్లలో రైతు వేదికలను నిర్మించామన్నారు. పల్లెప్రగతిలో భాగంగా గ్రామాభివృద్ధే ధ్యేయంగా కరోనా వచ్చినా కూడా ప్రతి నెలా పంచాయతీలకు నిధులను కేటాయించింద న్నారు. జిల్లాలోని 266పంచాయతీల్లో సామాజిక మ రుగుదొడ్లు, డంపింగ్‌ యార్డులు ఏర్పాటు చేశామని, 103 వైకుంఠధామాలు, 257కాంపోస్టు షెడ్‌లను నిర్మిం చామన్నారు. ప్రతి 20ఇళ్లకు ఒక మహిళకు బాధ్యతను అప్పగించి చెత్తరహిత గ్రామాలుగా తీర్చిదిద్దుతున్నా మన్నారు. స్వచ్ఛతలో పలు అవార్డులు పొందిన జిల్లా కు గత ఏడాది నవంబర్‌ 19న ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా జాతీయ స్థాయిలో మరో అవార్డు వచ్చిందన్నారు. 79,659మంది జిల్లా వ్యాప్తం గా ఆసరా పింఛన్లను అందజేస్తున్నామన్నారు. స్వశక్తి సంఘాలకు బ్యాంకు లింకేజీ కింద 217కోట్ల రుణాలు, స్త్రీనిధి ద్వారా 21కోట్ల వరకు రుణాలు ఇప్పించామన్నా రు. గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద జాబ్‌కార్డుల ను అందజేసి పనులను కల్పిస్తున్నామన్నారు. 

పూర్తికావస్తున్న టీఎస్‌పీపీ పనులు

రామగుండం ఎన్టీపీసీలో చేపట్టనున్న టీఎస్‌టీపీపీ 4 వేల మెగావాట్ల పనుల్లో మొదటి దశ పనులు పూర్తి కావస్తున్నాయని అన్నారు. 69,819 పంపుసెట్లకు ఉచితంగా విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామని తెలి పారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 9 నుంచి ఆపై తరగ తులు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నా రు. 6వ విడత హరితహారంలో 74.74 లక్షల మొక్కల ను నాటి వాటి సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నామ న్నారు. టీఎస్‌ ఐపాస్‌ కింద 13,648 కోట్ల పెట్టుబడితో 4,200మందికి ఉపాధి కల్పించేందుకు 365యూనిట్లకు అనుమతి ఇచ్చామన్నారు. ప్రధానమంత్రి ఉపాధి కల్ప న పథకం కింద జిల్లాలో 2020-21లో 26 మందికి 83.60 లక్షల సబ్సిడీ ఇచ్చామన్నారు. 2019-20లో ఎస్సీ విద్యార్థులకు ఫీజురీయింబర్స్‌మెంట్‌, ఉపకార వేతనా ల కింద రూ.3.54కోట్లు, బీసీ విద్యార్థులకు రూ.13.43 కోట్లు, మైనార్టీ విద్యార్థులకు రూ.1.34 కోట్లు అందజేశా మన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల కింద పేదింటి మహిళల వివాహాలకు 1,00,116రూపాయలు అందస్తు న్నామని, కల్యాణలక్ష్మి ద్వారా 2,906 మందికి 26.9 లక్షలు, షాదీముబారక్‌ కింద 165మందికి 1.65 కోట్లు ఇచ్చామన్నారు. జిల్లాలోగల 706 అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ఆరోగ్యలక్ష్మి పథకం కింద గర్భిణీలు, బాలింతలు, పిల్లలకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నామ న్నారు. జిల్లాలో 2,15,756 కార్డులపై సబ్సిడీ బియ్యాన్ని ఇస్తున్నామన్నారు. వానాకాలంలో 302వరిధాన్యం కొను గోలు కేంద్రాల ద్వారా 50,056మంది రైతుల నుంచి 453కోట్ల 46లక్ష విలువగల ధాన్యాన్ని కొనుగోలు చేశా మన్నారు. జిల్లా అభివృద్ధికోసం సహకరిస్తున్న మంత్రు లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీచైర్మన్‌, ఇతర ప్రజా ప్రతినిధులు, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఎప్పటిలాగానే జిల్లా మరింత అభివృద్ధి చెందేందుకు సహకరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ కు మార్‌దీపక్‌ కోరారు. అనంతరం ఆయా శాఖల్లో ఉత్త మ సేవలు అందించిన అధికారులు, సిబ్బందికి ప్రశం సాపత్రాలను అందజేశారు. స్వతంత్ర సమరయోధురా లు, మావోయిస్టు నేత మల్లోజుల వేణుగోపాలరావు తల్లి మల్లోజుల మధురమ్మను సన్మానించారు. కార్య క్రమంలో డీసీపీ పులిగిల్ల రవీందర్‌, డీఆర్‌ఓ నర్సింహ మూర్తి, ఆర్‌డిఓ శంకర్‌ కుమార్‌, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రఘువీర్‌ సింగ్‌, జడ్పీ వైస్‌చైర్‌పర్సన్‌ మండిగ రేణుక, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement