Advertisement
Advertisement
Abn logo
Advertisement

పారిశుధ్యం, మౌలిక వసతుల్లో ముందుంటా

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మెరుగైన ర్యాంకులు సాధించిన మునిసిపాలిటీలు 

ఉమ్మడి జిల్లాలో ఏడు మునిసిపాలిటీలకు ర్యాంకులు

దక్షిణాదిలో నాలుగో ర్యాంకు సాధించిన భువనగిరి


భువనగిరి టౌన్‌:  స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఉమ్మడి జిల్లా మునిసిపాలిటీలు మెరుగైన ర్యాంకులు సాధించాయి. కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖల పర్యవేక్షణలో జాతీయస్థాయిలో జనాభా కేటగిరీల ఆధారం గా ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌ ర్యాంకులు దక్కాయి. ఉమ్మడి జిల్లాలో 18 మునిసిపాలిటీలు ఉండగా, ఏడు మునిసిపాలిటీలు ఉత్తమ ర్యాంకులు సాధించాయి. భువనగిరి మునిసిపాలిటీ దక్షిణాదిలో 4వ ర్యాంకు, రాష్ట్ర పరిధిలో 24వర్యాంకు వచ్చింది. క్షేత్ర స్థాయిలో అమలవుతున్న పారిశుధ్యం, ఇం టింటి నుంచి చెత్త సేకరణ, వీధి దీపాలు హరితహారం, కంపోస్టు యా ర్డుల నిర్వహణ, వర్మీకంపోస్టు తయరీ, పార్కుల నిర్వహణ, తాగునీటి సరఫరా, బహిరంగ ప్రదేశాల్లో మల, మూత్ర విసర్జన నియంత్రణ, ఇం టింటా మరుగుదొడ్ల నిర్మాణం (ఓడిఎఫ్‌) తదితర అంశాల ఆధారంగా స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2021లో మెరుగైన ర్యాంకులు సాధించాయి. రెండు రోజుల క్రితం ప్రారంభమైన స్వచ్ఛ సర్వేక్షన్‌-2022లో మరింత మెరుగై న ర్యాంకులు సాధించే దిశగా కార్యచరణ ప్రారంభించాయి.ఈమేరకు తొలుత అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు.


ఏడు మునిసిపాలిటీలకు...

మునిసిపాలిటీల్లో జనాభా లక్ష నుంచి 10లక్షల వరకు ఉన్న కేటగిరీ లో సూర్యాపేట, నల్లగొండ, మిర్యాలగూడ మునిసిపాలిటీలు, లక్షలోపు జనాభా ఉన్న కేటగిరీలో భువనగిరి, హుజూర్‌నగర్‌, కోదాడ, దేవరకొం డ, హాలియా మునిసిపాలిటీలకు ఉత్తమ ర్యాంకులు వచ్చాయి. లక్షకుపైగా జనాభా ఉన్న మునిసిపాలిటీలు జాతీయస్థాయిలో, లక్షలోపు జనాభా ఉన్న మునిసిపాలిటీలకు దక్షిణ భారతదేశం పరిధిలో పోటీపడాల్సి ఉంటుంది. ఈ మేరకు 2021లో భువనగిరి మునిసిపాలిటీ లక్షలో పు జనాభా కేటగిరీలో దక్షిణ భారతదేశంలో నాలుగో ర్యాంకు, రాష్ట్ర స్థాయిలో 24వ ర్యాంకును సాధించింది. అయితే స్వచ్ఛ సర్వేక్షణ్‌-2020లో రాష్ట్రంలో మునిసిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ కావడంతో అన్ని మునిసిపాలిటీలు ఈ ర్యాంకులకు దూరమయ్యాయి. 2021 సర్వేక్షణ్‌లో మాత్రం మెరుగైన ర్యాంకులు సాధించాయి.


ర్యాంకుల కేటాయింపు ఇలా

స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డు కోసం పలు అంశాలో 6,000 పాయింట్లకు మునిసిపాలిటీలు పోటీపడాల్సి ఉంటుంది. అందుకోసం కేంద్ర ప్రభుత్వం నియమించిన బృందాలు క్షేత్రస్థాయిలో పరిశీలించి నిబంధనల ఆధారంగా పాయింట్లు కేటాయిస్తారు. అదేవిధంగా ప్రజల అభిప్రాయాలకు పాయింట్లు కేటాయిస్తాన్నారు. వీటిలో ఎస్‌ఎల్‌పీకి 2400 పాయింట్లు, స్వర్టిఫికేషన్‌కు 1800 పాయింట్లు, సిటిజన్‌ వాయి్‌సకు 1800 పాయింట్లు ఉంటాయి.


స్వచ్ఛ సర్వేక్షణ్‌-2022లో ప్రజలు భాగస్వాములు కావాలి : ఎనబోయిన ఆంజనేయులు, భువనగిరి మునిసిపల్‌ చెర్మన్‌

స్వచ్ఛ సర్వేక్షణ్‌-2022లో ప్రజలందరూ భాగస్వాములు కావాలి. మునిసిపాలిటీ అందిస్తున్న సేవలను స్వద్వినియోగం చేసుకుంటూ పరిసరాల పరిశుభ్రత పాటించాలి. వ్యర్థాలను రహదారులపై పడవేయవద్దు. సామూహిక మూత్రశాలలను వినియోగించాలి. పెట్రోల్‌ బంక్‌, ఆస్పత్రులు, బస్టాండ్‌ తదితర జనసామర్ధ్యం ఉండే ప్రాంతాల్లో ప్రజల అవసరాలకు సరిపడా మరుడు దోడ్లు నిర్మించాం. వాటిని సద్వినియోగం చేసుకోవాలి.లక్షకుపైగా జనాభా కేటగిరీలో ర్యాంకులు ఇలా

మునిసిపాలిటీ 2019లో 2020లో 2021లో

    ర్యాంకు ర్యాంకు     ర్యాంకు

సూర్యాపేట 1256 326 158

నల్లగొండ 267 226 179

మిర్యాలగూడ 294 306 191


లక్షలోపు జనాభా కేటగిరీలో ర్యాంకులు ఇలా

మునిసిపాలిటీ 2019లో 2020లో 2021లో

ర్యాంకు ర్యాంకు ర్యాంకు

భువనగిరి 17 139 24

హుజూర్‌నగర్‌ 712 09 64

కోదాడ 89 109 52

దేవరకొండ - - 111

హాలియా - - 102

Advertisement
Advertisement