Abn logo
Nov 26 2020 @ 13:14PM

దుబాయ్‌లో నితిన్, కీర్తి.. ఫొటో వైరల్!

లాక్‌డౌన్ సమయంలో వివాహం చేసుకుని ఓ ఇంటివాడైన యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం సినిమా షూటింగ్‌ల్లో పాల్గొంటున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తను నటిస్తున్న `రంగ్ దే` సినిమాను సంక్రాంతికి సిద్ధం చేసున్నాడు. కీర్తీ సురేష్ ఈ సినిమాలో హీరోయిన్. ఇటీవల హైదరాబాద్‌లో షూటింగ్‌ను పూర్తి చేసిన చిత్ర యూనిట్ దుబాయ్‌కు పయనమైంది. 


వెళ్లిన వెంటనే అక్కడ చిత్రీకరణను ప్రారంభమైంది. అక్కడ షూటింగ్ స్పాట్‌లో తీసిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నితిన్, కీర్తి కలర్‌ఫుల్‌గా కనిపిస్తున్నారు. దుబాయ్ షెడ్యూల్‌తో ఈ సినిమా షూటింగ్ పూర్తి కాబోతున్నట్టు సమాచారం. సంక్రాంతికి సినిమాను విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటన విడుదల చేసింది. 

Advertisement
Advertisement
Advertisement