మిలటరీ రహస్యాన్ని బహిర్గతం చేయడం దేశద్రోహం : ఏకే ఆంటోనీ

ABN , First Publish Date - 2021-01-20T21:09:06+05:30 IST

దేశ మిలటరీ వ్యవహారాల అధికారిక రహస్యాన్ని బహిర్గతం చేయడం దేశద్రోహమని, దీనికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కేంద్ర

మిలటరీ రహస్యాన్ని బహిర్గతం చేయడం దేశద్రోహం : ఏకే ఆంటోనీ

న్యూఢిల్లీ : దేశ మిలటరీ వ్యవహారాల అధికారిక రహస్యాన్ని బహిర్గతం చేయడం దేశద్రోహమని, దీనికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కేంద్ర రక్షణ శాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోనీ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘దేశ మిలటరీ వ్యవహారాలకు సంబంధించిన రహస్యాన్ని బహిర్గతం చేయడం దేశ ద్రోహం. ఇది ఎవరు చేసినా వారిని కఠినంగా శిక్షించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వారిపై దయ చూపరాదు.’’ అని ఆంటోనీ డిమాండ్ చేశారు. రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నబ్ గోసవ్ామి వాట్సాప్ చాట్ లీకైన విషయం తెలిసిందే. అందులో పుల్వామా, బాలకోట్ దాడుల ప్రస్తావన ఉంది. ఈ నేపథ్యంలోనే ఏకే ఆంటోనీ పై వ్యాఖ్యలు చేశారు. 

Updated Date - 2021-01-20T21:09:06+05:30 IST