నీ అంత నైపుణ్యం లేదు..
ABN , First Publish Date - 2020-04-10T09:45:39+05:30 IST
డబుల్స్‌లో మాజీ సహచరుడు లియాండర్ పేస్ విసిరిన ‘ఫ్రయింగ్ ప్యాన్’ చాలెంజ్‌ను టెన్నిస్ దిగ్గజం మహేశ్ భూపతి స్వీకరించాడు. లాక్‌డౌన్‌తో ...
పేస్ చాలెంజ్‌కు భూపతి స్పందన
న్యూఢిల్లీ: డబుల్స్‌లో మాజీ సహచరుడు లియాండర్ పేస్ విసిరిన ‘ఫ్రయింగ్ ప్యాన్’ చాలెంజ్‌ను టెన్నిస్ దిగ్గజం మహేశ్ భూపతి స్వీకరించాడు. లాక్‌డౌన్‌తో ప్రస్తుతం ఇంటివద్దే ఉంటున్న ఆటగాళ్లు విభిన్న పనులు చేస్తూ.. సహచరులకు సవాలు విసురుతున్నారు. ఈ నేపథ్యంలో పేస్ ‘ఫ్రయింగ్ ప్యాన్’ సవాలు విసిరాడు. ‘గయ్స్.. లాక్‌డౌన్‌లో ఉన్న మీకో చాలెంజ్. ఎంతమంది నా ప్యాన్ సవాలును స్వీకరిస్తారు’ అంటూ ప్యాన్‌తో టెన్నిస్ బంతిని వాలీలుగా కొడుతున్న వీడియోను ట్వీట్ చేశాడు. ఇందుకు స్పందించిన భూపతి.. ఓ చిన్న ప్యాన్‌తో బంతిని కొట్టిన వీడియోను పోస్ట్ చేశాడు. ‘లియాండర్. ఇదిగో.. నీ సవాలుకు నా ప్రతి సవాలు. కానీ నీ అంత నైపుణ్యంగా ప్యాన్‌తో బంతిని కొట్టలేకపోయా’ అని సరదాగా కామెంట్ చేశాడు.