లాక్‌డౌన్‌లో నాకు సంతోషాన్నిచ్చేది అదే!

ABN , First Publish Date - 2020-06-21T05:30:00+05:30 IST

‘‘మానసిక సంతృప్తి, సంతోషమే అన్నిటికంటే ముఖ్యమైనది’’ అని పూజా హెగ్డే అన్నారు. మానసిక ఒత్తిడి, ఆందోళనతో ఇటీవల సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో ఆమె పోస్ట్‌ పలువురి దృష్టిని ఆకర్షించింది...

లాక్‌డౌన్‌లో నాకు సంతోషాన్నిచ్చేది అదే!

‘‘మానసిక సంతృప్తి, సంతోషమే అన్నిటికంటే ముఖ్యమైనది’’ అని పూజా హెగ్డే అన్నారు. మానసిక ఒత్తిడి, ఆందోళనతో ఇటీవల సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో ఆమె పోస్ట్‌ పలువురి దృష్టిని ఆకర్షించింది. తనను సంతోషపెట్టేది ఏదో చెప్పడంతో పాటు ప్రేక్షకులకు వాళ్లను సంతోషపెట్టేది ఏదో అన్వేషించమని సలహా ఇచ్చారామె. కుటుంబ సభ్యులకు శుక్రవారం రాత్రి మష్రూమ్‌ రైస్‌, క్రీమీ టస్కన్‌ చికెన్‌ కర్రీ స్వయంగా వండటంతో పాటు వడ్డించారామె. పూజా హెగ్డే మాట్లాడుతూ ‘‘మీకు సంతోషాన్నిచ్చేది ఏదో వెతకండి. మానసిక సంతృప్తే అన్నిటికంటే ముఖ్యమైనది. లాక్‌డౌన్‌లో మా కుటుంబానికి వంట చేయడం నాకు ఆనందాన్నిచ్చింది. ఇస్తోంది! ఫుడ్‌ అంటే నేను హ్యాపీగా ఫీలవుతా. నా ముఖం మీద చిరునవ్వును తీసుకొచ్చేది ఆహారమే. నాకు సంతోషా న్నిచ్చేది ఏదో ఎప్పటి కప్పుడు మీతో పంచు కుంటున్నా. ఇది మీకూ సంతోషాన్ని స్తుందని ఆశిస్తున్నా’’ అన్నారు.


- పూజా హెగ్డే


Updated Date - 2020-06-21T05:30:00+05:30 IST