సోదరుడిపై పగ.. విచిత్ర రివెంజ్!

ABN , First Publish Date - 2021-03-24T02:21:04+05:30 IST

అన్నదమ్ముల మధ్య పంతం.. ఒకరికొకరు ఎదురుపడితే మొహం తిప్పేసుకునేంత ద్వేహం.. సింపుల్‌గా చెప్పాలంటే ఆగర్భశత్రుత్వం..! కారణాలు అనేకం ఉండొచ్చుకానీ.. ఈ కాన్సెప్ట్ అందరికీ తెలిసిందే. తోడబుట్టిన వారిపై కోపం పెంచుకున్న అనేక మంది ఆ బంధాన్ని శాస్వతంగా తెంచేసుకుంటారు. ఈ క్రమంలో కొంతమందికి రివెంజ్ కూడా తీర్చుకుంటూ ఉంటారు. అట్లాంటి ఓ ఫన్నీ రివెంజ్ స్టోరీని ఇప్పుడు చెప్పుకోబోతున్నాం.

సోదరుడిపై పగ.. విచిత్ర రివెంజ్!

ఇంటర్నెట్ డెస్క్: అన్నదమ్ముల మధ్య అగాధం.. ఒకరికొకరు ఎదురుపడితే మొహం తిప్పేసుకునేంత ద్వేషం.. సింపుల్‌గా చెప్పాలంటే ఆగర్భశత్రుత్వం..! కారణాలు అనేకం ఉండొచ్చుకానీ.. ఈ కాన్సెప్ట్ అందరికీ తెలిసిందే. తోడబుట్టిన వారిపై కోపం పెంచుకున్న అనేక మంది ఆ బంధాన్ని శాస్వతంగా తెంచేసుకుంటారు. ఈ క్రమంలో కొంతమందికి రివెంజ్ కూడా తీర్చుకుంటూ ఉంటారు. అట్లాంటి ఓ ఫన్నీ రివెంజ్ స్టోరీని ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. లెబానాన్‌కు చెందిన ఓ వ్యక్తి తన సోదరుడిపై రివెంజ్ తీర్చుకునేందుకు ఏకంగా ఓ భవంతి కట్టేశాడు.. అదేంటీ..బల్డింగ్‌తో ప్రతికారామా అని ఆశ్చర్యపోతున్నారా.. అటువంటి డౌట్ సహజమే లెండి..! ఈ సందేహాలన్నీ తీరాలంటే ఈ వార్త ఆసాంతం చదవాల్సిందే..!


లెబనాన్ రాజధాని బీరుట్‌లో ఉంటుందీ బంగళా.. ప్రపంచంలోనే అత్యంత బక్కపలుచని భవంతి. ఓ చివరన దీని వెడల్పు 14 అడుగులు కాగా.. మరో చివరిన కేవలం రెండు అడుగుల మాత్రమే దీని వెడల్పు ఉంటుంది. దీని ప్రధానోద్యేశ్యం రివేంజ్. ఎన్నో దశాబ్దాల క్రితం అంటే.. సుమారు 1950లో ఈ భవింతిని నిర్మించారట. పగ తీర్చుకునేందు్కు ఇది నిర్మించినప్పటికీ పనిలో పనిగా దీన్ని నివాసయోగ్యంగా కూడా తీర్చిదిద్దారు. లెబనాన్ అంతర్యుద్ధం సందర్భంగా ఈ బిగ్డింగ్‌ను వేశ్యా గృహంగా ఉపయోగపడిందట. భవంతి విషేశాలు తెలసుకున్నాం కాబట్టి.. ఇకి రివెంజ్ లోకి ఎంటరైపోదాం..


అప్పట్లో ఇద్దరు సహోదరులు తమ తండ్రి నుంచి కొంత జాగాను వారసత్వంగా పొందారు. ఒకరి జాగా ఎదురుగా సముద్రం ఉంటుంది. ఎదురుగా అంత మంచి వ్యూ ఉండటంతో సహజంగానే అతడి జాగాకు డిమాండ్ పెరిగి బాగా అభివృద్ధి చెందింది. ఈ పరిస్థితి సహోదరుడిలో అక్కసు పెంచింది. ఈ ఫీలింగ్ లోంచి నుంచి పుట్టిందే ఈ ఐడియా! తనది చిన్న జాగా అయినప్పటికీ ప్రతికారం తీర్చుకోవాలన్న పంతంతో అతడు ఈ బంగ్లా నిర్మాణానికి పూనుకున్నాడు. ఆ తరువాత అనేక మంది ఈ భవింతిని కొన్నారు, అమ్మారు. ఎన్నో తరాలు కాలగర్భంలో కలిసిపోయాయి. దీని యజమాని ఎవరనే దానిపై ఇప్పటికీ క్లారిటీ లేదు. అయితే..బంగ్లా నిర్మాణం వెనుకున్న ప్రధానఉద్దేశ్యాన్ని స్థానికులు కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటే విన్న ఓ ఆర్కిటెక్ట్ దీన్ని సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి తెలియజేయడంతో ఈ ఉదంతం ట్రెండింగ్‌లోకి వచ్చాయి. ప్రస్తుతం నెటిజన్లు ఇటువంటి రివెంజ్ బంగ్లాకు సంబంధించి పలు ఫోటోలు షేర్ చేస్తూ..ఈ తరహా ప్రతీకారం అంత అరుదైనదేమీ కాదని ఢంకా బజాయించి మరీ చెబుతున్నారు. అన్నట్టు.. ఈ భవంతి పేరు ‘అక్కసు’ అట..!

Updated Date - 2021-03-24T02:21:04+05:30 IST