సంక్షేమ నిధిని దారిమళ్లించారు

ABN , First Publish Date - 2020-06-30T10:45:21+05:30 IST

లాక్‌ డౌన్‌లో భవన నిర్మాణ కార్మికులకు అందించాల్సిన రూ. వెయ్యి కోట్ల సంక్షేమ నిధిని రాష్ట్ర ము ఖ్యమంత్రి కేసీఆర్‌

సంక్షేమ నిధిని దారిమళ్లించారు

సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని


కొత్తగూడెం సంక్షేమం, జూన్‌ 29 : లాక్‌ డౌన్‌లో భవన నిర్మాణ కార్మికులకు అందించాల్సిన రూ. వెయ్యి కోట్ల సంక్షేమ నిధిని రాష్ట్ర ము ఖ్యమంత్రి కేసీఆర్‌ దారిమళ్లించారని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. నిర్మాణ రంగ కార్మికుల స మస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఏఐటీయూసీ అనుబంధ రాష్ట్ర బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్‌, ఇతర నిర్మాణ కార్మిక సంఘం జిల్లా సమితి ఆధ్వర్యంలో భౌతిక దూరం పాటిస్తూ సోమవారం శేషగిరి భవన్‌ నుంచి కలెక్టర్‌ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించి జేసీకి వినతి పత్రం అందజేశారు.


ప్రదర్శనను ప్రారంభించిన సందర్భంగా శేషగిరి భవన్‌లో కార్మికులను ఉద్దేశించి కూనంనేని మాట్లాడారు. ప్రజలు, కార్మికుల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోకుండా లాక్‌ డౌన్‌ ప్రకటించి ప్రభుత్వాలు చేతులు దులుపుకున్నాయని విమర్శించారు.  కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గుత్తుల సత్యనారాయణ, కార్యదర్శి వి. మల్లిఖార్జున్‌, కొత్తగూడెం పట్టణ కార్యదర్శి వై. శ్రీనివాసరెడ్డి, నాగయ్య, కోటేశ్వరరావు, మోహన్‌,కృష్ణ, చంద్రమౌళి, భిక్షపతి, రాజు, సురేందర్‌రెడ్డి, రాములు, ఆదామ్‌, వెంకటేశ్వర్లు, సర్వ కృష్ణ పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-30T10:45:21+05:30 IST