వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ భారత్‌లో తక్కువే!

ABN , First Publish Date - 2021-05-18T02:39:56+05:30 IST

భారత్‌లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్పరిణామాలు తక్కువగానే ఉన్నాయని అడ్వెర్స్ ఈవెంట్ ఫాలోయింగ్ ఇమ్యూనైజేషన్ (ఏఈఎఫ్ఐ) వెల్ల‌డించింది.

వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ భారత్‌లో తక్కువే!

భారత్‌లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్పరిణామాలు తక్కువగానే ఉన్నాయని అడ్వెర్స్ ఈవెంట్ ఫాలోయింగ్ ఇమ్యూనైజేషన్ (ఏఈఎఫ్ఐ) వెల్ల‌డించింది. వ్యాక్సినేషన్ దుష్పరిణామాలపై తన నివేదికను ఈ రోజు (సోమవారం) కేంద్రానికి సమర్పించింది. భార‌త్‌లో కోవిషీల్డ్ టీకా వేసుకున్న వారిలో కేవలం 26 మందిలో మాత్రమే రక్త స్రావం, రక్తం గడ్డకట్టడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నట్టు తెలిపింది. భారత్ బయోటెక్ రూపొందించిన `కోవాగ్జిన్` తీసుకున్నవారిలో ఇలాంటి కేసులేవీ గుర్తించలేదని పేర్కొంది. 


ఆక్స్‌ఫ‌ర్డ్‌-ఆస్ట్రాజెనికా త‌యారు చేసిన టీకాల‌ను భారత్‌లో సీరం సంస్థ `కోవిషీల్డ్` పేరుతో పంపిణీ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ టీకాల వ‌ల్ల కొంద‌రిలో ర‌క్తం గ‌డ్డ‌క‌ట్టిన‌ట్లు ఇటీవ‌ల కొన్ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే అలాంటి కేసులు భారత్‌లో అతి స్వల్పమని ఏఈఎఫ్ఐ వెల్లడించింది. భారత్‌లో ఇప్పటివరకు కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను 650,819 మందికి ఇచ్చారని, వారిలో 700 మందిలో మాత్ర‌మే సైడ్ ఎఫెక్ట్స్ కనిపించాయని  పేర్కొంది. వాటిల్లో 498 కేసులపై లోతుగా అధ్యయనం చేయగా కేవలం 26 మందికి మాత్రం వ్యాక్సిన్ తీసుకున్న త‌ర్వాత ర‌క్తం గ‌డ్డ‌క‌ట్టిన‌ట్టు తేలింది. కోవిషీల్డ్ తీసుకున్న‌వారిలో `త్రాంబో ఎంబోలిక్` కేసులు 0.61గా ఉన్న‌ట్లు క‌మిటీ స్ప‌ష్టం చేసింది. ఇక, కోవాగ్జిన్ టీకా తీసుకున్న‌వారిలో ర‌క్తం గ‌డ్డ‌క‌ట్టిన కేసులేవీ న‌మోదు కాలేద‌ని తెలిపింది. 

Updated Date - 2021-05-18T02:39:56+05:30 IST