Abn logo
Nov 22 2020 @ 16:14PM

బాలీవుడ్‌ నటి కన్నుమూత

Kaakateeya

బాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. పలు సీరియల్స్‌, సినిమాల్లో నటించిన నటి లీనా ఆచార్య(30) ఆదివారం కన్నుమూశారు. గత రెండేళ్లుగా లీనా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ముంబైలోని చికిత్స తీసుకుంటున్న ఆమె కన్నుమూశారు. లీనా మరణం బాలీవుడ్‌ వర్గాలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి. రాణీ ముఖర్జీ నటించిన హిచ్కీ చిత్రంలో లీనా ఆచార్యకు మంచి పేరు వచ్చింది. ఈమె చివరిసారిగా క్లాస్‌ ఆఫ్‌ 2020 అనే వెబ్‌ సిరీస్‌లో నటించారు. 


Advertisement
Advertisement