Abn logo
Sep 19 2020 @ 13:45PM

నా కల నిజమైంది: దేవిశ్రీ ప్రసాద్‌

Kaakateeya

రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజికల్‌ డ్రీమ్‌ పూర్తయ్యిందట. ఈ విషయాన్ని ఆయనే తెలిపారు. వివరాల్లోకెళ్తే దేవిశ్రీప్రసాద్‌ గురువు మాండలిన్‌ శ్రీనివాస్‌. గురువుతో కలిసి మ్యూజిక్‌ కంపోజ్‌ చేయాలని దేవిశ్రీ ప్రసాద్‌ భావించారు. కానీ మాండలిన్‌ శ్రీనివాస్‌ పరమపదించడంతో దేవిశ్రీ కోరిక తీరనేలేదు. అయితే ఇప్పుడు కొంత మేరకు తన మ్యూజికల్‌ డ్రీమ్‌ పూర్తయ్యిందని అంటున్నారు రాక్‌స్టార్‌. "మాండలిన్‌ శ్రీనివాస్‌గారిని కంపోజిషన్‌ చేయాలని అనుకున్నప్పటికీ ఆయనపై ఉన్న గౌరవంతో ఆయన్ని అడిగే ధైర్యం చేయలేదు. ఒకవేళ అడిగి ఉంటే ఒప్పుకునేవారేమోనని ఇప్పుడు అనిపిస్తుంది. అయితే అన్నగారు పరమపదించిన తర్వాత ఇటీవల ఆయన సోలో మాండలిన్ ట్రాక్ను విన్నాను. ఆయన నా గురువు. ఆయన ట్రాక్‌లోని కొంత భాగాన్ని ఆర్కెస్ట్రా చేసి ఆయనకు అంకితమివ్వాలని అనుకున్నాను. శ్రీనివాస్‌గారి సోదరుడు రాజేశ్‌గారిని కలిసి నా కోరిక చెప్పగానే ఆయన ఒప్పుకుని ఆ ట్రాక్‌ నాకు ఇచ్చారు. ఇప్పుడు నా కల నిజమైంది. గురువుగారి కంపోజిషన్‌కు శిష్యుడి ఆర్కెస్ట్రా ఇది. లెగసీ ఫ్రమ్‌ అన్నయ్య ఆల్బమ్‌" అంటూ దేవిశ్రీ ప్రసాద్‌ కంపోజిషన్‌ను సోషల్‌ మీడియా ద్వారా విడుదల చేశారు. 



Advertisement
Advertisement
Advertisement