నిమ్మగడ్డి - కొత్తిమీర సూప్‌

ABN , First Publish Date - 2020-08-01T19:19:46+05:30 IST

కొత్తిమీర - రెండు కట్టలు, పచ్చిమిర్చి - రెండు, అల్లం - చిన్నముక్క, ఉల్లిపాయ - ఒకటి, క్యారెట్‌లు - రెండు, నిమ్మకాయ - ఒకటి, కొబ్బరిపాలు - అరకప్పు, ఉప్పు - తగినంత, లె

నిమ్మగడ్డి - కొత్తిమీర సూప్‌

కావలసినవి: కొత్తిమీర - రెండు కట్టలు, పచ్చిమిర్చి - రెండు, అల్లం - చిన్నముక్క, ఉల్లిపాయ - ఒకటి, క్యారెట్‌లు - రెండు, నిమ్మకాయ - ఒకటి, కొబ్బరిపాలు - అరకప్పు, ఉప్పు - తగినంత, లెమన్‌గ్రాస్‌ స్టాక్‌ - ఒకకప్పు, ఉల్లికాడలు - అరకప్పు.


తయారీ: కొత్తిమీరను శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్‌ చేయాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయను కట్‌ చేయాలి. క్యారెట్లను తురుముకోవాలి. ఉల్లికాడలను చిన్నగా తరగాలి. ఒక పాత్రలో కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, లెమన్‌గ్రాస్‌ స్టాక్‌ తీసుకోవాలి. అందులో కొబ్బరిపాలు, ఒక కప్పు నీళ్లు పోసి చిన్నమంటపై అరగంటపాటు మరిగించాలి. తరువాత ఈ మిశ్రమాన్ని మరొక పాత్రలోకి వడబోయాలి. అందులో క్యారెట్‌ తురుము, ఉల్లికాడలు, తగినంత ఉప్పు వేసి మరికాసేపు మరిగించాలి. కొత్తిమీర, నిమ్మకాయ ముక్కలతో గార్నిష్‌ చేసుకుంటే రుచిగా బాగుంటుంది.

Updated Date - 2020-08-01T19:19:46+05:30 IST