నిమ్మరైతు కష్టం రోడ్డుపాలు

ABN , First Publish Date - 2021-06-14T09:21:22+05:30 IST

ఆరుగాలం అన్నదాత పడ్డ కష్టం రోడ్డుపాలైంది. కళ్లలో పెట్టుకుని పెంచుకున్న పంటను తన చేతులతోనే మట్టిపాలు చేయాల్సి వచ్చింది. కరోనా రక్కసి నిమ్మ పంటపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

నిమ్మరైతు కష్టం రోడ్డుపాలు

ఆరుగాలం అన్నదాత పడ్డ కష్టం రోడ్డుపాలైంది. కళ్లలో పెట్టుకుని పెంచుకున్న పంటను తన చేతులతోనే మట్టిపాలు చేయాల్సి వచ్చింది. కరోనా రక్కసి నిమ్మ పంటపై తీవ్ర ప్రభావం చూపుతోంది. లాక్‌డౌన్‌లు, కర్ఫ్యూల కారణంగా ఎగుమతులు నిలిచిపోయాయి. నిమ్మను కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. కూలీలను పెట్టి పంట కోసి, ఆ పంటను బస్తాలలో వేసుకుని మార్కెట్‌లకు వెళితే కనీసం కూలీ, రవాణా చార్జీలు రావడం లేదు. ఈ ఏడాది మే నెలలో కేజీ రూ.60 నుంచి రూ.70 పలికిన నిమ్మ ధర ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో కేజీ రూ.5 నుంచి రూ.8లకు పడిపోయింది. ఈ పరిస్థితుల్లో పంటను ఏం చేయాలో తెలియక రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. గిట్టుబాటు ధర అందక పంట ఎగుమతి చేసే అవకాశం లేక చాలామంది రైతులు తమ పంటను జంగారెడ్డిగూడెం జాతీయ రహదారి పక్కనే ఇలా పడేస్తున్నారు.


జంగారెడ్డిగూడెం

Updated Date - 2021-06-14T09:21:22+05:30 IST