కిలో నిమ్మ ఒక్క రూపాయి

ABN , First Publish Date - 2021-06-19T04:37:12+05:30 IST

నిమ్మ కిలో ఒక్క రూపాయి ఉంది.

కిలో నిమ్మ ఒక్క రూపాయి
దూబచర్లలో రోడ్డు పక్కన పారబోసిన నిమ్మకాయలు

నల్లజర్ల, జూన్‌ 18: నిమ్మ కిలో ఒక్క రూపాయి ఉంది. రైతులకు కడుపు రగిలిపోయింది. దూబచర్లలో నిమ్మ రైతులు శుక్రవారం కొవ్వూరు–గుండుగొలను రహదారిపై నిమ్మకాయలు పారబోసి నిరసన వ్యక్తం చేశారు. నిమ్మ రైతు కాసాని బాల గంగధర్‌ (బాటయ్య) మాట్లాడుతూ నెల రోజులుగా నిమ్మ ధర పతనం అవుతుందని, శుక్రవారం కిలో ఒక్క రూపాయి ధర ఉంద న్నారు. నిమ్మకాయలు కోసిన కూలీ ఖర్చులు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బస్తా నిమ్మకాయలు కోసినందుకు కూలీలకు, రవాణా కలిపి రూ.400 ఖర్చు అవుతుందన్నారు. మార్కెట్‌లో బస్తాకు రూ.100 నుంచి రూ150 వరకు చెల్లిస్తున్నట్లు పేర్కొన్నారు. నిమ్మకాయలు కోసినందుకు రైతు ఆదనంగా రూ250 చెల్లించవలసి వస్తుందన్నారు. 30 సంతవ్సరాలుగా పెట్టుబడులు పెట్టి పెంచిన నిమ్మతోటను ఉంచాలో తొలగించాలో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరో రెండు నెలలు మార్కెట్‌ ఇదే తరహ ఉంటే నిమ్మ రైతులు తోటలను తొలగించక తప్పదన్నారు. ప్రభుత్వం వెంటనే నిమ్మరైతులకు ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో తాతిన శ్రీను,చుండ్రు నాగు, రాంబాబు, సత్తియ్య, యలమాటి నాగు పాల్గొన్నారు.



Updated Date - 2021-06-19T04:37:12+05:30 IST