లెమన్‌ వెర్మిసెల్లీ

ABN , First Publish Date - 2021-01-16T19:48:12+05:30 IST

సేమ్యా - రెండు కప్పులు, కొబ్బరి తురుము - రెండు టేబుల్‌స్పూన్లు, ఇంగువ - అర టీస్పూన్‌, ఉప్పు - తగినంత, పంచదార - అర టీస్పూన్‌, పసుపు - అర టీస్పూన్‌, కొబ్బరి నూనె

లెమన్‌ వెర్మిసెల్లీ

కావలసినవి: సేమ్యా - రెండు కప్పులు, కొబ్బరి తురుము - రెండు టేబుల్‌స్పూన్లు, ఇంగువ - అర టీస్పూన్‌, ఉప్పు - తగినంత, పంచదార - అర టీస్పూన్‌, పసుపు - అర టీస్పూన్‌, కొబ్బరి నూనె - రెండు టీస్పూన్లు, నిమ్మరసం - రెండు టీస్పూన్లు, కొత్తిమీర - ఒక కట్ట, ఆవాలు - అర టీస్పూన్‌, సెనగపప్పు - ఒక  టేబుల్‌స్పూన్‌, మినప్పప్పు - ఒక టేబుల్‌స్పూన్‌, వేరుసెనగ - రెండు టేబుల్‌స్పూన్లు, కరివేపాకు - కొద్దిగా.


పేస్టు కోసం : కొబ్బరి తురుము - అరకప్పు, పచ్చిమిర్చి - మూడు, ఆవాలు - అర టీస్పూన్‌.


తయారీ విధానం: ముందుగా కొబ్బరి తురుము, పచ్చిమిర్చి, ఆవాలను మిక్సీలో వేసి పేస్టులా చేసుకోవాలి. స్టవ్‌పై పాన్‌ పెట్టి కొద్దిగా నూనె వేసి ఆవాలు, సెనగపప్పు, మినప్పప్పు, వేరుసెనగ, కరివేపాకు వేసి వేగించాలి. పసుపు, ఇంగువ వేసి కలపాలి. కాసేపు వేగిన తరువాత సిద్ధం చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్టు వేయాలి. ఇప్పుడు సేమ్యా వేసి కొద్దిగా ఉప్పు, పంచదార వేసి కలపాలి. చిన్నమంటపై రెండు నిమిషాలు వేగనివ్వాలి. తరువాత కొబ్బరినూనె, కొబ్బరి తురుము, నిమ్మరసం, కొత్తిమీర వేసి కలియబెట్టాలి. కాసేపు వేగిన తరువాత దింపి సర్వ్‌ చేసుకోవాలి.


Updated Date - 2021-01-16T19:48:12+05:30 IST