నిమ్మరసం ఇలా!

ABN , First Publish Date - 2020-07-22T20:54:07+05:30 IST

నిమ్మరసం తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి అందరికీ తెలిసిందే! అయితే ఆరోగ్య ప్రయోజనం సంపూర్తిగా పొందాలంటే తాగవలసిన నీళ్లు, నిమ్మరసం పరిమాణాల

నిమ్మరసం ఇలా!

నిమ్మరసం తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి అందరికీ తెలిసిందే! అయితే ఆరోగ్య ప్రయోజనం సంపూర్తిగా పొందాలంటే తాగవలసిన నీళ్లు, నిమ్మరసం పరిమాణాల మీద కూడా దృష్టి పెట్టాలి. 


కావలసినవి: 3 కప్పుల నీళ్లు, 6 నిమ్మకాయలు, 2 టేబుల్‌స్పూన్ల తేనె.


తయారీ ఇలా: నిమ్మకాయలను మధ్యకు కోసి, నీళ్లలో వేసి ఐదు నిమిషాల పాటు మరిగించాలి. తర్వాత నీళ్లు చల్లార్చి, నిమ్మకాయ బద్దలను పిండి, తీసేయాలి. తర్వాత నీళ్లను వడగట్టి సీసాలో నింపుకోవాలి. ఈ నీళ్లను ఓ కప్పులో నింపి, తేనె కలిపి తాగాలి. ఈ నీళ్లు పరగడుపున తాగడం వల్ల వ్యాధినిరోధకశక్తి, జీర్ణశక్తి పెరుగుతాయి. శక్తి సమకూరుతుంది. అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది.

Updated Date - 2020-07-22T20:54:07+05:30 IST