ఏప్రిల్‌ 8న ‘లెనోవా’ గేమింగ్‌ ఫోన్‌

ABN , First Publish Date - 2021-04-03T05:52:20+05:30 IST

చైనా కంపెనీ ‘లెనోవా’ తదుపరి గేమింగ్‌ ఫోన్‌ ‘లెజియన్‌ 2ప్రొ’ని ఏప్రిల్‌ 8న విడుదల చేయనుంది. ఈ ఫోన్‌కు లోపల

ఏప్రిల్‌ 8న ‘లెనోవా’ గేమింగ్‌ ఫోన్‌

చైనా కంపెనీ ‘లెనోవా’ తదుపరి గేమింగ్‌ ఫోన్‌ ‘లెజియన్‌ 2ప్రొ’ని ఏప్రిల్‌ 8న విడుదల చేయనుంది.  ఈ ఫోన్‌కు లోపల రెండు ఫ్యాన్లతో టర్బో కూలింగ్‌ విధానం ఉందన్న విషయం ఒక్కటి మాత్రమే ఇంతవరకు అధికారికంగా వెల్లడైంది. నుబియా రెడ్‌ మేజిక్‌ సిరీస్‌ ఫోన్ల మాదిరిగానే 16జీబీ ర్యామ్‌, క్వాల్కామ్‌ స్నాఫ్‌డ్రాగన్‌ 888తో వస్తుందని వినికిడి. రెండు యుఎస్‌బి పోర్టుల ద్వారా 110వాట్స్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌ ఉంటుందని సమాచారం. గీక్‌బెంచ్‌పై కనిపించిన ఈ ఫోన్‌ ఎల్‌70081 మోడల్‌ నంబర్‌తో క్వాల్కామ్‌ చిప్‌సెట్‌ కలిగి ఉంది.

Updated Date - 2021-04-03T05:52:20+05:30 IST