బావిలో నుంచి బయటపడిన చిరుత

ABN , First Publish Date - 2021-01-16T06:05:47+05:30 IST

బోయినపల్లి మండలం మల్కాపూర్‌ శివారులోని వ్యవసాయ బావిలో కనిపించిన చిరుతపులి బయటపడింది.

బావిలో నుంచి బయటపడిన చిరుత
చిరుత పులి పాద ముద్రలు, పరిశీలిస్తున్న అధికారులు

- కొడిమ్యాల అటవీ ప్రాంతంవైపు వెళ్లినట్లు అఽధికారుల వెల్లడి

- భయాందోళనలో పరిసర గ్రామాల ప్రజలు 

బోయినపల్లి, జనవరి 15: బోయినపల్లి మండలం మల్కాపూర్‌ శివారులోని వ్యవసాయ బావిలో కనిపించిన చిరుతపులి బయటపడింది. గ్రామానికి చెం దిన కోరెపు సురేష్‌ వ్యవసాయ బావిలో బుధవారం స్థానిక రైతులకు చిరుత కనిపించింది. విషయాన్ని అటవీ శాఖ అధికారులకు తెలియజేశారు. ఫారెస్ట్‌ అధికారులు చిరుతను వెలికి తీసేందుకు ప్ర యత్నించగా బావిలోని బండరాళ్ల మధ్య ఉన్న సందులో (సొరికె) దాక్కుంది. దీంతో చిరుతను బయటకు రప్పించడానికి నిచ్చె నలు ఏర్పాటు చేశారు. అధికారుల సమా చారంతో హైదరాబాద్‌ రెస్క్యూటీం ఘటన స్థలానికి చేరుకుంది. అప్పటికే చీకటి పడ డంతో గురువారం చిరుతకు మత్తు మందు ఇచ్చి బయటకు తీసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది.  గురువారం తెల్లవారుజామున రె స్క్యూ టీంసభ్యులు బావిలోకి వెళ్లి సొరికెను పరిశీలించగా చిరుత లేక పోవడంతో నిచ్చెన ద్వారా బయటకు వచ్చినట్టు గుర్తించారు. బావి సమీపంలో పులి పాదాల అడుగులు కనిపించడంతో చిరుత తన స్థావరానికి వెళ్లి నట్లు అటవీ శాఖ అఽధికారులు పేర్కొంటు న్నారు. జిల్లాలోని అడవుల్లో నాలుగు చిరుత పులులు ఉన్నట్టు ఎఫ్‌ఆర్‌వో ఆశా తెలిపారు.  బావి వద్ద ఏర్పాటు చేసిన సీసీ  కెమెరాల్లో చిరుత వెళ్లినట్లు కనిపించకపోవడంతో గ్రామ స్థులు భయాందోళనలకు గురవుతున్నారు. 

Updated Date - 2021-01-16T06:05:47+05:30 IST